అల్లరి నరేష్‌ మంచి మాట.. ప్రతి హీరో ఇలాగే ఉంటే అన్నీ సినిమాలు హిట్స్ ఖాయం

అల్లరి సినిమాతో హీరోగా పరిచయమైన నరేష్ ఆ తర్వాత అల్లరి నరేష్( Allari naresh ) గా మారి పోయాడు.మొదటి సినిమాతో నవ్వించిన నరేష్ ఆ తర్వాత అల్లరి నరేష్ గా నవ్విస్తూనే ఉన్నాడు.

 Allari Naresh Want To Do More Multi Starrer ,allari Naresh , Multi Starrer , Ma-TeluguStop.com

దాదాపు దశాబ్ద కాలం పాటు మినిమం గ్యారంటీ హీరోగా నిలిచిన అల్లరి నరేష్ మధ్యలో కాస్త ఒడిదుడుకులని ఎదుర్కొన్నాడు.చేసిన ప్రతి కామెడీ పాత్ర రొటీన్ గా ఉంది అంటూ విమర్శలు ఎదుర్కోవడంతో పాటు ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వచ్చింది.

దాంతో అల్లరి నరేష్ ఆలోచన తీరు మారింది.

Telugu Allari Naresh, Maharshi, Mahesh Babu, Multi Starrer, Naandhi, Tollywood,

కామెడీ మాత్రమే ఎందుకు ట్రై చేయాలి సీరియస్ ఎందుకు ట్రై చేయకూడదు అంటూ కొన్ని సినిమాలు చేశాడు.అందులో నాంది సినిమా( Naandhi ) భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.ప్రస్తుతం అదే సినిమా దర్శకుడితో చేసిన ఉగ్రం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు.

భారీ అంచనాలను పొందిన ఉగ్రం సినిమా ను భారీ ఎత్తున తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Telugu Allari Naresh, Maharshi, Mahesh Babu, Multi Starrer, Naandhi, Tollywood,

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమాల పట్ల తాను చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా పేర్కొన్నాడు.మరో హీరోతో కలిసి నటించడం వల్ల ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించే అవకాశం ఉంటుంది అని అల్లరి నరేష్ భావిస్తున్నాడు.

మహేష్ బాబు ( Mahesh Babu )తో కలిసి నటించినట్లుగా సీనియర్ స్టార్ హీరోలతో మరియు ప్రస్తుత యంగ్ స్టార్ హీరోలతో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ అల్లరి నరేష్ ప్రకటించాడు.

Telugu Allari Naresh, Maharshi, Mahesh Babu, Multi Starrer, Naandhi, Tollywood,

కథ పాత్ర విషయం లో కాస్త జాగ్రత్తగా ఉంటే తప్పకుండా తాను నటించేందుకు సిద్ధం అన్నట్లుగా తాజా ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ చేసిన ప్రకటన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.అందరు హీరోలు కూడా ఇలా ఆలోచిస్తే బాగుంటుంది కదా.ఎందుకు అందరూ హీరోలు అల్లరి నరేష్ మాదిరిగా ఆలోచించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఉగ్రం సినిమా సక్సెస్ అయితే అల్లరి నరేష్ మరిన్ని సీరియస్ పాత్రల్లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆయన సన్నిహితులు అభిప్రాయం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube