ఆ రెండు పార్టీలకు అంత సీన్ లేదా ? 

తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి.సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాయి.

 There Is No Scene For Those Two Parties ,ysrtp, Sharmila, Jagan , Ntr, Ttdp, Tel-TeluguStop.com

తామే బలమైన పార్టీగా చెప్పుకుంటూ, తామే అధికారంలోకి రాబోతున్నామనే హడావుడి మొదలుపెట్టేశాయి.ముఖ్యంగా ప్రధాన పార్టీలుగా ఉన్న బి ఆర్ ఎస్,  బిజెపి, కాంగ్రెస్( BRS, BJP, Congress ) లు పోటా పోటీగా కార్యక్రమాలు చేపడుతూ , అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనేక రాజకీయ వ్యూహ రచన చేస్తున్నాయి.ఈ మూడు ప్రధాన పార్టీలతో పాటు, తెలుగుదేశం, వైఎస్సార్  తెలంగాణ పార్టీలు ( Telugu Desam and YSR Telangana parties )తాము కూడా అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేస్తూ పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసే పనిలో నిమగ్నమయ్యాయి.

అయితే ఈ రెండు పార్టీలను జనాలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది చర్చనీయంశం గా మారింది.ఏపీ,  తెలంగాణ విభజన తర్వాత తెలంగాణలో టిడిపి బాగా బలహీనం అయ్యింది .

Telugu Brs, Chandrababu, Jagan, Sharmila, Telangana Tdp, Ttdp, Ysrtp-Politics

ఆ పార్టీలోని కీలక నాయకులంతా ఇతర పార్టీల్లో చేరిపోయారు.దాదాపు పార్టీ ఇక్కడ కనుమరుగవుతుంది అనుకుంటున్న దశలో మళ్లీ పార్టీ ని బలోపేతం  చేసే విధంగా చంద్రబాబు( Chandrababu ) చర్యలు తీసుకున్నారు.తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneshwar ) ను నియమించారు.ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని యాక్టివ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈనెల 26 నుంచి మినీ మహానాడు పేరుతో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించే విధంగా ప్లాన్ చేశారు.ఈనెల 26న ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, కార్వాన్, పరిగి, మహబూబ్ నగర్, నర్సాపూర్, సత్తుపల్లి లలో మినీ మహానాడులను నిర్వహించనున్నారు.

మే 20 లోపు మినీ మహానాడులు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.తెలంగాణలో ఎన్టీఆర్ ఓట్ బ్యాంక్ ఇంకా ఉందని చంద్రబాబు ఇంకా భావిస్తుండడంతోనే, టిడిపిని ఇక్కడ యాక్టివ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే టిడిపిని ఏపీ పార్టీగానే చూస్తూ ఉండడం , ఎన్టీఆర్ ప్రభావం బాగా తగ్గిపోవడం వంటివి తెలంగాణ టిడిపి ఆశలపై నీళ్లు జల్లుతున్నాయి.

Telugu Brs, Chandrababu, Jagan, Sharmila, Telangana Tdp, Ttdp, Ysrtp-Politics

ఎన్ని చేపట్టినా,  తెలంగాణలో టిడిపి బలం పుంజుకోవడం కష్టమనే అభిప్రాయాలు జనాల్లో ఉన్నాయి.ఇక వైఎస్సార్ తెలంగాణ పార్టీ పరిస్థితి అంతే.వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ప్రభావం తెలంగాణలో ఉంటుందని,  ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా తనకు అండగా నిలబడతారని షర్మిల ఆశలు పెట్టుకున్నారు.

అయితే పార్టీ స్థాపించి మూడేళ్లు అవుతున్న పెద్దగా చేరికలు లేవు.ఆ పార్టీ తెలంగాణలో బలం పుంజుకుంటుంది అనే నమ్మకం లేకపోవడంతో ఆ పార్టీలో చేరేందుకు ఎవరు ఆసక్తి చూపించడం లేదు.

పెద్దగా బలం,  బలగం, ఓటు బ్యాంకు లేకపోయినా ఈ రెండు  పార్టీలు మాత్రం తామే అధికారంలోకి రాబోతున్నాము  అనే విధంగా హడావుడి చేస్తున్నాయి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube