రాష్ట్ర ఆదాయంలో 90 శాతం ఉద్యోగుల ప్రయోజనార్థమే ఖర్చు పెడుతున్నప్పటికీ వారికి సంతృప్తి లేదంటూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రప్రసాద్( Buggana Rajendraprasad ) చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .ఇప్పటికే తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం తగిన రీతిలో స్పందించడం లేదంటూ అసంతృప్తితో ఉన్న ఉద్యోగులకు( AP Govt Employees ) మంత్రి వ్యాఖ్యలు మరింత కాక పుట్టించేటట్టుగా ఉన్నాయని తెలుస్తుంది … రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్లు అయితే 90 వేల కోట్లు ఉద్యోగులకే ఖర్చు పెడుతున్నామని అయినా వారు సంతోషంగా లేరంటూ బుగ్గన వ్యాఖ్యలు చేశారు.
ఇది ప్రజల్లో తమను పలుచన చేసే కుట్ర అని ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు చేసిందేమీ లేదని.,కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో కానీ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో కానీ పిఆర్సి విషయంలో కానీ ఎప్పటినుంచో ఉన్న వేతన సవరణ చట్టాల అమలులో గాని ఈ ప్రభుత్వం ఉద్యోగుల కోసం తీసుకున్న ఒక మంచి నిర్ణయం లేదని ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు( Bopparaju Venkateswarlu ) విమర్శించారు

వాలంటీర్ల జీతాలతో సహా కలుపుకున్నా కూడా ఉద్యోగుల వేతనాలు 60 వేల కోట్లు దాటవని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ప్రజలలో ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కోపం పెరిగేలా చేసే ఇలాంటి వ్యాఖ్యలను మానుకోవాలని ఆయన హితవు చెప్పారు …తామేమి కడుపు నిండి ఉద్యమాలు చేయడం లేదని, కడుపు మండి ఉద్యమాలు చేస్తున్నామని ప్రభుత్వం తెలుసుకోవాలని ఆయన కోరారు… మంత్రి ప్రకటన ప్రజలలో .

ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తప్పుడు సంకేతాలు పంపిస్తుందని ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలంటూ ఆయన చెప్పుకోచ్చారు ఉద్యోగుల సంక్షేమార్దం అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ఆ హామీలు అమలు దిశగా కృషి చేయాలని కోరారు.ఇలా తమనే బూచిగా చూపించే ప్రయత్నం చేస్తే మాత్రం తమ శక్తి ఎంతో ప్రభుత్వానికి తెలియజేస్తామని ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఉద్యమాలకు కలిసి రావాలని లేకపోతే వారు తగిన మూల్యాన్ని చెల్లిస్తారంటూ ఆయన చెప్పుకొచ్చారు….







