మీలో ఎవరైనా కొత్తగా బైక్ కొనాలని అనుకుంటున్నారా? ఎలక్ట్రిక్ బైక్, ఎలక్ట్రిక్ స్కూటర్ ( Electric Bike, Electric Scooter )వంటి వాటి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకు ఇది శుభవార్తే అని చెప్పుకోవాలి.ఓ బ్యాంక్ మీకోసం అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది.
ఈజీ ఈఎంఐ, క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.ఇంతకీ ఆ బ్యాంకు ఏదని అనుకుంటున్నారా? ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకు అయినటువంటి ఐసీఐసీఐ బ్యాంక్ ( ICICI Bank )తాజాగా తన కస్టమర్లకు టూవీలర్ కొనుగోలుపై అదిరే ఆఫర్స్ తీసుకు వచ్చింది.

అయితే… ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమంటే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు( ICICI Bank Credit Card ) వాడే వారికి మాత్రమే ఈ ఆఫర్లు వర్తించనున్నాయి.అవును, ఇపుడు క్రెడిట్ కార్డు ద్వారా మీరు టూవీలర్లు కొనుగోలు చేస్తే.మీకు అదనంగా రూ.1000 క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది.టూవీలర్లు లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందని గుర్తు పెట్టుకోండి.అదేవిధంగా ఇన్‌స్టంట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందే వీలుంది.ఇక దానికోసం ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదు.అలాగే వడ్డీ రేటు కూడా తక్కువగానే ఉంటాయని బ్యాంక్ తాజా ప్రకటనలో చెప్పుకొచ్చింది.

అయితే ఈ ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయని, సదరు అవకాశాన్ని వినియోగించుకోవాలని కస్టమర్లని బ్యాంక్ కోరుతోంది.ఇకపోతే పైన్ ల్యాబ్స్ పీఓఎస్ మెషీన్ల ద్వారా నిర్వహించే ట్రాన్సాక్షన్లకు మాత్రమే ఈ ఆఫర్లు వర్తిస్తాయి.హీరో మోటొకార్ప్, బజాజ్ ఆటో, హోండా, సుజుకీ, కేటీఎం, టీవీఎస్ కంపెనీలకు చెందిన టూవీలర్లపై మాత్రమే ఈ ఆఫర్లు ఉంటాయి.అంతేకాకుండా హయాసా, హీరో ఎలక్ట్రిక్, ఒకినవా, మోటోవోల్ట్, ఏడీఎంఎస్ వంటి ఎలక్ట్రిక్ టూవీలర్లపై కూడా ఈ డీల్స్ సొంతం చేసుకోవచ్చు.కాగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌పై అయితే రూ.8 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.







