తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.టెన్త్ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో ప్రభుత్వం తరపున పీపీ వాదనలు వినిపించారు.
బండి సంజయ్ బెయిల్ కండీషన్లను ఉల్లంఘిస్తున్నారని పీపీ తెలిపారు.హిందీ పేపర్ మాల్ ప్రాక్టీస్ కేసులో విచారణకు సహకరించడం లేదని వెల్లడించారు.
బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేయాలన్న బండి సంజయ్ తరపు లాయర్ వాదించారు.ఈ క్రమంలో ఇరు పక్షాల వాదనలు విన్న హన్మకొండ కోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.