కోలీవుడ్ (Kollywood) స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ (Thalapathy Vijay) ఒకరు.ఈయనకు తమిళ్ లో రజనీకాంత్ (Rajinikanth) తర్వాత భారీ ఫాలోయింగ్ ఏర్పరుచు కున్నారు.
అందుకే ఈయన సినిమా వస్తుంది అంటే తమిళ్ ప్రేక్షకులకు పండుగ అనే చెప్పాలి.అందుకే ఈయన లైనప్ పై ఇంట్రెస్టింగ్ గాసిప్స్ వైరల్ అవుతూనే ఉంటాయి.
మరి గత కొన్ని రోజులుగా ఈయన 68వ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట హల్ చల్ చేస్తుంది.
విజయ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘లియో’.
భారీ అంచనాలు నెలకొన్న తమిళ్ క్రేజీ ప్రాజెక్ట్ గా ఈ సినిమా పాన్ ఇండియా బరిలో ఉంది.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది.
వీరి కాంబోలో రాబోతున్నట్టు రెండవ సినిమా ఇది.అంతేకాదు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమైన ఈ సినిమాపై తమిళ్ లో ఇప్పుడే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత విజయ్ మరోసారి తెలుగు డైరెక్టర్ కు ఓకే చెప్పాడు అంటూ రూమర్స్ గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి.

యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో విజయ్ తన నెక్స్ట్ చేయబోతున్నాడు అని టాక్ వచ్చింది.ఇది వచ్చి కొద్దీ రోజులు కూడా అవ్వకముందే మరో డైరెక్టర్ పేరు వినిపిస్తుంది.విక్రమ్ వేద (Vikram Vedha) డైరెక్టర్లు పుష్కర్ – గాయత్రి (Pushkar–Gayathri) దర్శకత్వంలో విజయ్ 68వ (Thalapathy68) సినిమా చేస్తున్నాడని రూమర్స్ వస్తున్నాయి.
మరి డ్యూయో డైరెక్షనల్ లో విజయ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే.







