దుబాయ్( Dubai ) ఒక విలాసవంతమైన నగరమని అనడంలో సందేహం లేదు.ఈ నగరంలో ఎక్కడ చూసినా లగ్జరీ కార్లు, ఎత్తైన భవనాలు, విలాసవంతమైన వెకేషన్ స్పాట్‌లు, షాపింగ్ మాల్స్, చాలా ఖరీదైన స్టైలిష్ ఇళ్లు దర్శనమిస్తుంటాయి.
చాలా రిచెస్ట్ సిటీ అయిన దుబాయ్ లో సంపన్నులు మాత్రమే స్థిరపడగలరని కూడా చెప్పొచ్చు.ఇక ఇక్కడ ఒక ఖాళీ స్థలం కొనాలన్నా వందల కోట్లలో వెచ్చించక తప్పదు.
అయితే ఇటీవల, ఒక ఖాళీ స్థలం $34 మిలియన్లకు అమ్ముడుపోయింది.అంటే దాదాపు రూ.278 కోట్లు.పైగా ఆ స్థలంలో మొత్తం ఇసుకే ( sand )ఉంది.
సముద్రతీర ప్రాంతంలో ఇది ఉంటుంది.సాధారణంగా సముద్ర తీరంలో ఉన్న ఇళ్లకు కూడా ఇంత మొత్తంలో ఎవరూ ఖర్చు చేయరు.
దుబాయ్‌లోని మానవ నిర్మిత ద్వీపమైన జుమేరా బే ఐలాండ్‌లో( Jumeirah Bay Island ) ఈ స్థలం ఉంది.ఇది 24,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది.ప్రస్తుతం దానిపై ఎటువంటి నిర్మాణాలు కట్టలేదు.
ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన రికార్డ్ బ్రేకింగ్ డీల్‌లో ఈ భూమిని బ్రిటిష్ ఫ్యాషన్ వ్యవస్థాపకులు విక్రయించారు.దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ డీల్‌లు సాధారణంగా మెగా-మాన్షన్‌లు, అల్ట్రా- లగ్జరీ అపార్ట్‌మెంట్‌ల కోసం ఉంటాయి, అయితే ఈ కళ్ళు చెదిరే విక్రయం ఖాళీ ఇసుక ప్లాట్‌ల కోసం మాత్రమే జరిగింది.
ఈ ఇసుక దిబ్బ కోసం పెట్టిన డబ్బులతో ముంబైలో ఒక మంచి రాజ భవనమే సొంతం చేసుకోవచ్చు.మరి ఈ ఇసుక మాత్రమే ఉన్న స్థలం పైన ఏదైనా రాజభవనం నిర్మిస్తారా లేక హోటల్ కడతారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.
మొత్తంమీద, దుబాయ్‌లోని ఈ ల్యాండ్ ప్లాట్‌కు పలికిన ధర రికార్డు సృష్టించింది.