సూర్య 'కంగువ' ఫస్ట్ సింగిల్ అప్డేట్.. టైం ఫిక్స్!

కోలీవుడ్ హీరోల్లో అద్బుతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో సూర్య.ప్రస్తుతం సూర్య తన కెరీర్ లో 42వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.‘‘కంగువ” ( Suriya ) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది.సూర్య సినిమాల కోసం తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు.

 Suriya - Disha Patani's Kanguva Update, Kanguva, Suriya 42, Suriya, Director Sir-TeluguStop.com

ఈ మధ్య కాలంలో సూర్య నటిస్తున్న అన్ని సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాలు సాధిస్తున్నాయి.అందుకే ఇప్పుడు చేస్తున్న కంగువ సినిమా మీద మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.డైరెక్టర్ శివ ( Siruthai Siva ) దర్శకత్వంలో గ్రాండ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోలీవుడ్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఇక ఈ సినిమా నుండి తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది.కోలీవుడ్ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ( Kanguva First Single ) మే రెండవ వారంలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా కోసం ఆల్ ఓవర్ ఇండియా ఎదురు చూస్తుంది.

యూవీ క్రియేషన్స్ అండ్ గ్రీన్ స్టూడియోస్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా దాదాపు 10 భాషల్లో రిలీజ్ కానున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉండగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా దిశా పటానీ ( Disha Patani ) హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.మరి సూర్య ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube