ఈ మధ్యకాలంలో ప్రేమించి పెళ్లి ( Love Marriage ) చేసుకున్న వారి సంఖ్య కన్నా ప్రేమించి విడిపోయిన వారి సంఖ్య చాలా ఎక్కువ.ఇద్దరు కలిసి ప్రేమించుకోవడానికి పలు కారణాలు ఉండొచ్చు.
కానీ ప్రేమించుకున్న వారు విడిపోవాలంటే ప్రత్యేకంగా ఎటువంటి కారణాలు అవసరంలేదు.కేవలం తమ అవసరాలు తీరాక సింపుల్ గా ప్రేమించిన వారిని మోసం చేసి తమ దారి తాము చూసుకుంటున్నారు.
ఇలాంటి కోవకు చెందిన ఓ సంఘటన ఛత్తీస్ గడ్ లోని( Chattisgarh ) బస్తర్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఓ ప్రేమికుడు తాను ప్రేమించిన యువతిని మోసం చేసి, మరో యువతితో పెళ్లికి సిద్ధపడ్డాడు.
దీంతో ఆ యువతి ఏకంగా పెళ్లి మండపానికి వెళ్లి ప్రియుడుతో సహా అతని బంధువులకు కూడా ఊహించని షాక్ ఇచ్చింది.వివరాల్లోకెళితే.ఛత్తీస్ గడ్ లోని భానుపురికి చెందిన దమ్రుధర్ భాఘెల్ (25) అనే వ్యక్తి, ఓ యువతితో కొంతకాలం ప్రేమ వ్యవహారం నడిపాడు.అయితే ఇరువురి మధ్య గొడవ కారణంగా భాఘెల్ తన ప్రియురాలిని ( Girl Friend ) దూరం పెట్టేసి, తాను మరో యువతితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఆ తర్వాత భాఘెల్ కు మరో యువతితో పెళ్లి నిశ్చయం అయింది.ఆ విషయం ప్రియురాలికి తెలియడంతో కోపంతో రగిలిపోతూ ప్రియుడిని చంపి పగ తీర్చుకోవాలి అనుకుంది.పెళ్లి మండపానికి అబ్బాయిలాగా మారువేషంలో వచ్చి వధూవరులపై యాసిడ్ దాడి చేసి, అక్కడి నుంచి పారిపోయింది.

ఘటన జరుగుతున్న సమయంలో కరెంట్ లేకపోవడంతో ఆ మారువేషంలో వచ్చిన యువతి సులువుగా అక్కడి నుండి తప్పించుకుంది.గాయాలైన వధూవరులను ఆస్పత్రిలో చేర్పించి, పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి సిసి టీవీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా మారువేషంలో వచ్చిన అమ్మాయి వరుడు యొక్క మాజీ ప్రియురాలు అని తేలింది.దీంతో దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు.







