కడప జిల్లా ప్రొద్దుటూరులో ఫ్లెక్సీల కలకలం చెలరేగింది.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
సునీతా పాలిటిక్స్ లోకి రంగ ప్రవేశం చేస్తున్నారంటూ రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి.టీడీపీ నేతలు చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఫొటోలతో పాటు సునీత ఫొటోతో ఫ్లెక్సీలు, పోస్టర్లు కన్పిస్తున్నాయి.
కాగా ఈ పోస్టర్లు ప్రస్తుతం రాజకీయ చర్చకు దారి తీశాయి.