అమిత్ షా అలా అనడం వెనుక పెద్ద రాజకీయమే ఉందా ? 

కేంద్ర హోం మంత్రి చేసిన ప్రకటన తెలంగాణ ( Telangana )రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.ముఖ్యంగా బీజేపీ  తెలంగాణలో అధికారంలోకి వస్తే .

 Is There A Big Politics Behind Amit Shah Saying That, Amith Sha, Telangana Cm Kc-TeluguStop.com

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చేసిన ప్రకటన కలకలం రేపుతుంది.అయితే అమిత్ షా( Amit Shah ) ఈ సమయంలో ఈ ప్రకటన చేయడం వెనుక కారణాలు ఏమిటి అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది .తెలంగాణలో బీ ఆర్ ఎస్,  ఎంఐఎం పార్టీలు  లోపాయికారి ఒప్పందం పెట్టుకుని ముందుకు వెళుతున్న నేపథ్యంలో,  ఆ రెండు పార్టీలకు చెక్ పెట్టే విధంగా అమిత్ షా ఈ ప్రకటన చేసినట్లుగా అర్థమవుతుంది .ఇటీవల కర్ణాటకలోనూ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తూ బిజెపి( BJP ) నిర్ణయం తీసుకుంది.  ఈ అంశంపై సుప్రీంకోర్టులోను పిటిషన్లు దాఖలు కావడంతో ఈ కేసు అక్కడ పెండింగ్ లో ఉంది.దానిపై ఇంకా తీర్పు వెలువడకముందే తెలంగాణలోనూ అదే విధంగా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశం గా మారింది.

Telugu Amith Sha, Bjp Chevella, Mim, Telangana-Politics

బీ ఆర్ ఎస్ కు( BRS ),  ఎంఐఎం కు చెక్ పెట్టే ఉద్దేశంతోనే ఈ ప్రకటన చేసినట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి.బీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉంటున్న ఎంఐఎం రాబోయే ఎన్నికల్లో మరిన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించింది.గత అసెంబ్లీ సమావేశాల్లోనే తాము 50 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్( Akbaruddin ) చెప్పారు.దీంతో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నచోట్ల  ఎం ఐ ఎం పోటీ చేస్తుందనే చర్చ జరుగుతోంది.

అలాగే బీఆర్ఎస్ కూడా మైనార్టీ ఓటర్ల పై ఎక్కువగా దృష్టి పెట్టింది .ఇటీవల జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తమ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకున్నా,  ఎంఐఎం పార్టీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఏకగ్రీవం అయ్యేలా కృషి చేసింది.

Telugu Amith Sha, Bjp Chevella, Mim, Telangana-Politics

దీంతో బీఆర్ఎస్ పై ముస్లింలు సానుకూలంగా ఉన్నారని,  ఆ పార్టీ భావిస్తుండగా టిఆర్ఎస్ మస్లిజ్ ను దెబ్బకొట్టే విధంగా అమిత్ షా ఈ ప్రకటన చేసినట్లుగా కనిపిస్తున్నారు.వాస్తవంగా మతపరమైన రిజర్వేషన్లు చెల్లవు అని బిజెపి ఎప్పటి నుంచో వాదిస్తుంది.దీనిలో భాగంగానే కర్ణాటకలో ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేశారు.ఇప్పుడు ముస్లిమేతర వర్గాలను బిజెపికి అనుకూలంగా మార్చుకునేందుకు తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామనే ప్రకటన అమిత్ షా చేసినట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube