సెలబ్రెటీలకు సంబంధించిన ఏదైనా వైరల్ అయ్యే విషయాలు నెటిజన్స్ దృష్టిలో పడితే అంతే సంగతి.ప్రతిసారి ఆ విషయాలను లాగుతూ సెలబ్రెటీలను బాగా ట్రోల్స్ ద్వారా టార్చర్ చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా వారి లవ్ ఎఫైర్ల గురించి వస్తే చాలు వాళ్ళు కనిపించిన ప్రతిసారి అదే టాపిక్ తీస్తూ ఉంటారు.ఇక ఈ మధ్య సోషల్ మీడియా( Social Media ) అందుబాటులో ఉండటంతో సెలబ్రెటీలు ఎక్కడ ఫోటోలు దిగిన కూడా వెంటనే షేర్ చేసుకుంటున్నారు.
అయితే తాజాగా పూజ హెగ్డే( Social Media ) చెట్ల తుప్పల్లో ఫోటో దిగగా వెంటనే సల్మాన్ ఖాన్( Salman Khan ) పేరు లాగుతూ బాగా ట్రోల్ చేయటం మొదలుపెట్టారు.అయితే ఆయన పేరు లాగటానికి కారణం ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎందుకంటే నటన పరంగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.చిన్న సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తొలిసారి నటనతో మంచి మార్కులు సంపాదించుకొని ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో పరుగులు తీస్తూ వచ్చింది.

వరుసహిట్లతో ఆ మధ్య టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.దర్శక నిర్మాతలు కూడా ఈ అమ్మడికి అవకాశాలు ఇవ్వడం కోసం బాగా ముందుకు వచ్చారు.అలా చాలామంది దర్శకుడు స్టార్ హీరోల సినిమాలలో ఈమెకు అవకాశాలు ఇవ్వగా.
అవి వరుసగా ప్లాప్ అయ్యాయి.దాదాపు వరుసగా నాలుగైదు సినిమాలు ప్లాప్ అవడంతో ఐరన్ లెగ్ అంటూ ముద్ర కూడా పడింది.

దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో అంతగా అవకాశాలు కూడా అందుకోవటం లేదు.ఇక వెంటనే బాలీవుడ్ వైపు అడుగులు వేసింది.అక్కడ కూడా ఇదే పరిస్థితి.అయినా కూడా కొంతవరకు అవకాశాలు అందుకుంటూనే ఉంది.అయితే తను సల్మాన్ ఖాన్ తో ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది లవ్ గా మారింది అని ఆ మధ్య బాలీవుడ్, టాలీవుడ్ లో బాగా హాట్ టాపిక్ గా మారింది.

మామూలుగా సల్మాన్ ఖాన్ ప్రేమ వ్యవహారాలు అందరికీ తెలిసిందే.ఇప్పటికే ఆయన చాలామంది హీరోయిన్లతో ప్రేమాయణం నడపగా ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా గడుపుతున్నాడు.అయితే ప్రస్తుతం పూజ హెగ్డే ప్రేమలో మునిగి తేలుతున్నాడని జోరుగా వార్తలు వస్తున్నాయి.దీంతో తెలుగు ప్రేక్షకులు కూడా పూజ హెగ్డేను బాగా టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు.
తెలుగు హీరోలను వదిలి హిందీ హీరోలను పట్టుకున్నావా అంటూ కొందరు కామెంట్లు కూడా చేశారు.అయితే తాజాగా పూజ హెగ్డే తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో పంచుకుంది.
అందులో తను చెట్ల పొద్దల్లో ఫోటోకు ఫోజ్ ఇచ్చింది.దీంతో ఆ ఫోటో చూసి ఆ చెట్ల తుప్పల్లో ఏం చేస్తున్నావు అంటూ.
పొరపాటున సల్మాన్ భాయ్ కానీ అక్కడికి వచ్చాడా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.







