Katrina Kaif : బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ గర్భవతి అయ్యారా.. ఇదే సాక్ష్యం అంటూ?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ( Katrina Kaif )గురించి మనందరికీ తెలిసిందే.కత్రినా కైఫ్ 2021 లో హీరో విక్కీ కౌశల్( Vicky Kaushal ) ని పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

 Crazy Rumor On Heroine Katrina Kaif-TeluguStop.com

కొంతకాలం పాటు ప్రేమించుకున్న ఈ జంట ఎట్టకేలకు 2021లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.ఇది ఇలా ఉంటే ఇక వీరి పెళ్లి అయినప్పటి నుంచి ఈ జంట ఎప్పుడెప్పుడు శుభవార్త చెబుతారా అని విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇది ఇలా ఉంది తాజాగా కత్రినా కైఫ్ కి సంబంధించిన ఒక వీడియోస్ చక్కర్లు కొట్టడంతో కత్రినా కైఫ్ గర్భవతి అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో గుప్పుమన్నాయి.

తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) చెల్లెలు అర్పితా ఖాన్ ( Arpita Khan )ముంబైలో గ్రాండ్ ఈద్ పార్టీని నిర్వహించారు.ఈ పార్టీకి కత్రినా కైఫ్ హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఆమె పార్టీకి అనార్కలి డిజైనర్ డ్రెస్ ని ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అయితే ఆమె ఆ పార్టీ లోపలికి కారు దిగి నడుచుకుంటూ వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఈ నేపథ్యంలోనే ఆమె కాస్త బొద్దుగా కల్పించడంతో అందులో పొట్ట కొంచెం ముందుకు కనపడటంతో ఆమె గర్భవతి అంటూ చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది అభిమానులు ఈ వార్తలపై స్పందిస్తూ ఒకవేళ ఆ వార్త నిజమైతే అంతకంటే ఇంకేం కావాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాలి అంటే కత్రినా కైఫ్ స్పందించేంతవరకు వేచి చూడాల్సిందే మరి.ఇకపోతే కత్రినా కైఫ్ విషయానికొస్తే ఈమె బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.టాలీవుడ్ లో వెంకటేష్ బాలయ్య సినిమాలలో నటించి మెప్పించింది.

వెంకటేష్ తో కలిసి మల్లీశ్వరి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.అప్పట్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అలాగే బాలయ్య బాబుతో కలిసి అల్లరి పిడుగు సినిమాలో నటించింది.ఆ సినిమా ఊహించిన విధంగా సక్సెస్ కాలేకపోయింది.

తెలుగులో కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసినా కత్రినా ఆ తర్వాత బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అక్కడ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.బాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా రాణించడంతో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube