రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర మహారాజ్ 890 వ జయంతి వేడుకలను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రైతు చర్చా మండలిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు , సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి లు హాజరై మహాత్మా బసవేశ్వర మహారాజ్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ సమాజంలో అహింస ద్వారా సమాజానికి మంచి మార్గాన్ని ఎన్నుకొని జీవించేలా మహాత్మా బసవేశ్వర మహారాజ్ బోధనలు చేశాడని గుర్తు చేశారు.అట్టడుగు వర్గాల ప్రజలు ఉన్నతంగా జీవించేవిధంగా మహాత్మా బసవేశ్వర మహారాజ్ బరోసా కల్పించాడన్నారు.
ఎల్లారెడ్డిపేట వీరశైవ లింగాయతుల సంక్షేమ సంఘం వారు భవన నిర్మాణానికి ఖాలీస్థలం ఏర్పాటు చేసుకున్నట్టు అయితే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో మాట్లాడి భవన నిర్మాణం కోసం దశలవారీగా ఐదు లక్షల రూపాయల చొప్పున మొత్తం 10 లక్షలు మంజూరు చేయిస్తానని జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు వారికి హామీ ఇవ్వడం జరిగింది.అనంతరం సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ కులం ఆరాధ్య దైవమైన మహాత్మా బసవేశ్వర మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోడానికి ఎల్లారెడ్డిపేట పాల కేంద్రం ముందు గల మూడు తోవ్వలకాడా అనుమతి ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు.
వచ్చే జయంతి వరకు మహాత్మా బసవేశ్వర మహారాజ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించుడు కాకుండా విగ్రహానికి పూలమాలలు చేద్దామని అన్నారు.ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి,బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి,వీరశైవ లింగాయతుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమ్ కుమార్ , ఆకుల రాములు మాట్లాడుతూ సమాజ హితం కోసం పాటుబడిన మహాత్మా బసవేశ్వర మహారాజ్ మార్గం అందరికి ఆచరణీయమన్నారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నిర్వహాకులు భోజనాలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సంక్షేమ సంఘం ప్రతినిధులు మాజీ సర్పంచ్ మంజుల ప్రసాద్ , భలిజ శంకర్ , భూమయ్య , శేఖర్ , వీరేశం సతీష్ , శివకుమార్ , అరుణ్ భలిజ లింగాయతుల సంక్షేమ సంఘానికి చెందిన వారు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు
.






