కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress party )విజయం ఖాయం అంటూ ఆ పార్టీ నేత నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.జేడీఎస్ మరియు కాంగ్రెస్ పార్టీ లు కలిసి అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అంటూ రాజకీయ వర్గాల వారు కూడా అభిప్రాయం చేస్తున్నారు.
తాజాగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi )ఆటలు సాగుతాయి, ఆయన మ్యాజిక్ సాగుతుంది.కానీ కన్నడ రాష్ట్రం లో ఆయన ఆటలు సాగవు.
ఆయన కు అంత సీన్ లేదు అంటూ కన్నడ కాంగ్రెస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల సిద్ధ రామయ్య ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కన్నడ రాష్ట్రంలో లేకుండా చేసేందుకు గతంలో మోడీ మరియు ఆయన పార్టీ నాయకులు చాలా ప్రయత్నాలు చేశారు.
ఆ విషయం అందరికీ తెలిసిందే.కానీ కాంగ్రెస్ పార్టీ ని ఏం చేయలేక పోయారు.
జేడీఎస్( JDS ) మరియు కాంగ్రెస్ పార్టీ కలిసి అధికారాన్ని దక్కించుకుంటాయి అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

దేశ వ్యాప్తంగా మోడీ యొక్క హవా కొనసాగుతుందేమో కానీ కర్ణాటకలో మాత్రం ఆయనకు అంత సీన్ లేదు అంటూ సిద్ద రామయ్య( Sidda Ramaiah ) తేల్చి పారేశారు.గతంలోనే అక్రమంగా అధికారాన్ని దక్కించుకొని రాజ్యాంగాన్ని పక్కన పెట్టిన మోడీ కి ఈసారి కచ్చితంగా కన్నడ ప్రజల బుద్ధి చెప్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇక బీ జే పీ కి మద్దతుగా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల ముఖ్య నేతలు కూడా ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
మరోసారి బిజెపిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఇతర కారణాల వల్ల మోడీ మాటలను కర్ణాటక ప్రజలు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, జేడీఎస్ కూడా ఈసారి బలం పుంజుకొని మరిన్ని స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చేస్తున్నారు.
బిజెపి పై ఉన్న వ్యతిరేకత కారణంగా కాంగ్రెస్ మరియు జేడీఎస్ పార్టీ ల యొక్క కూటమికి అధికారాన్ని కట్టబెట్టే అవకాశాలు లేకపోలేదు అంటూ జాతీయ స్థాయి రాజకీయ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







