అమెరికా : పోలీస్ శాఖలో కీలక పదవి.. చరిత్ర సృష్టించిన భారత సంతతి సిక్కు మహిళ

అమెరికాలో భారత సంతతి సిక్కు మహిళ చరిత్ర సృష్టించింది.అక్కడి పోలీస్ శాఖలో అసిస్టెంట్ పోలీస్ చీఫ్‌గా బాధ్యతలు అందుకున్న తొలి సిక్కు మహిళగా మన్మీత్ కౌర్ నిలిచారు.

 Indian-origin Sikh Woman Manmeet Kaur Becomes First Sikh Assistant Police Chief-TeluguStop.com

ఈమె స్వగ్రామం పంజాబ్‌లోని( punjab ) గురుదాస్‌పూర్ జిల్లా భుల్లేచక్ గ్రామం.మన్మీత్ సాధించిన ఘనతతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా మన్మీత్ కౌర్ తండ్రి కుల్వంత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.తాను భారత నౌకాదళంలో పనిచేశానని, ఈ క్రమంలోనే తన కుమార్తె సైతం చిన్నతనం నుంచే సైన్యంలో చేరాలని నిర్ణయించుకుందని చెప్పారు.

Telugu America, Gurdaspur, Indian Origin, Manmeet Kaur, Punjab, Sikh-Telugu NRI

ముఖ్యంగా మన్మీత్‌కు( Lt Manmeet Colon ) పిస్టల్స్ అంటే చాలా ఇష్టమని.కెరీర్ పట్ల ఆమెకు వున్న ఇష్టమే అమెరికాలో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పోలీస్ స్థాయికి చేరేలా చేసిందన్నారు.చదువులో ఎంతో చురుగ్గా వుండే మన్మీత్.అప్పటికే ఎఫ్‌బీఐ( FBI )లో పనిచేసిన బంధువులతో ప్రభావితమైందని చెప్పారు.ఆమె వచ్చే ఏడాది భారతదేశానికి రానున్నారని.అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో పూజలు చేస్తారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Telugu America, Gurdaspur, Indian Origin, Manmeet Kaur, Punjab, Sikh-Telugu NRI

ఇకపోతే.మన్మీత్ జలంధర్‌లోని గురురాందాస్ పబ్లిక్ స్కూల్‌లో ఆరవ తరగతి వరకు చదువుకున్నారు.ఆ తర్వాత 1996లో ఆమె తన కుటుంబంతో కలిసి అమెరికాకు వెళ్లింది.అక్కడ 12వ తరగతి పూర్తి చేసిన అనంతరం యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్ నుంచి కమర్షియల్ లా చీఫ్, మాస్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని పొందారు.2008లో పోలీస్ శాఖలో చేరిన మన్మీత్ ఎట్టకేలకు తన జీవితాశయాన్ని నెరవేర్చుకున్నారు.అనతికాలంలోనే సమర్ధురాలైన అధికారిగా పేరు తెచ్చుకున్న మన్మీత్.

ఇప్పుడు అసిస్టెంట్ పోలీస్ చీఫ్ స్థాయికి చేరుకున్నారు.

Telugu America, Gurdaspur, Indian Origin, Manmeet Kaur, Punjab, Sikh-Telugu NRI

కాగా.15వ శతాబ్ధంలో అవిభక్త భారత్‌లోని పంజాబ్‌లో సిక్కు మతం పుట్టింది.నేడు ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్లకు పైగా ప్రజలు ఈ మతాన్ని అనుసరిస్తున్నారు.అధికారిక గణాంకాల ప్రకారం.5,00,000 మంది సిక్కులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నారని అంచనా.అగ్రరాజ్యం తర్వాత ఆస్ట్రేలియా, కెనడా, యూకేలలో పెద్ద సంఖ్యలో సిక్కులు స్థిరపడ్డారు.పౌర హక్కులు, రాజకీయాలు, వ్యవసాయం, ఇంజనీరింగ్, వైద్యం తదితర రంగాలలో గడిచిన 125 సంవత్సరాలుగా సిక్కులు అమెరికన్ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube