టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన మైథలాజికల్ డ్రామా చిత్రం శాకుంతలం( Shaakuntalam ).హిందూ పురాణాల్లోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కించాడు.
శకుంతల పాత్రలో సమంత, దుశ్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించారు.ఈ సినిమాలో ముఖ్య పాత్ర అయిన భరతుడి రోల్ ని అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ( Allu Arha ) నటించి అందర్నీ ఆకట్టుకుంది.
అయితే ఏప్రిల్ 14న రిలీజ్ అయిన ఈ చిత్రం ఆడియన్స్ ని అనుకున్నంత రీతిలో ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అక్కినేని నాగచైతన్య అభిమానులు కారణం అంటూ కొందరు అంటుండగా మరికొందరు ఎన్టీఆర్ పేరు కూడా తీసుకువస్తున్నారు .వాస్తవానికి సమంత ఆ తరహా పౌరాణిక పాత్రలకు సెట్ అవుతుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

అయితే శాకుంతలం చిత్రం డిజాస్టర్ కావడం వెనుక ఎక్కువ భాద్యత తీసుకోవలసింది దర్శకుడు గుణశేఖర్ అనేవారు లేకపోలేదు.క్రేజీ ప్రాజెక్ట్ ను డీల్ చేస్తున్నప్పుడు ఆడియన్స్ అవుట్ పుట్ అద్భుతంగా ఉండాలని కోరుకుంటారు.కానీ శాకుంతలం చిత్రంలో విఎఫెక్స్ వర్క్ చాలా నాసిరకంగా ఉంది.
కార్టూన్ గ్రాఫిక్స్ అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.

ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్ కి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే .శాకుంతలం చిత్రంలో భరతుడి పాత్ర కోసం గుణశేఖర్ ముందుగా ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్( Nandamuri Abhay Ram ) ని అనుకున్నారని అంటున్నారు . గుణశేఖర్ ఎన్టీఆర్ ని సంప్రదించగా.తన కొడుకుని అప్పుడే సినిమాల్లో పరిచయం చేసే ఉద్దేశం లేదని తారక్ తెలిపాడని .గుణశేఖర్ ఆఫర్ ని ఎన్టీఆర్ మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

దీనితో గుణశేఖర్ బాగా అలోచించి అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హని బాల భరతుడిగా చూపించడానికి డిసైడ్ అయ్యారు.అల్లు అర్హ బాగానే చేసినప్పటికీ ఎన్టీఆర్ తనయుడు చేసి ఉంటే మరోలా ఉండేదని అంటున్నారు.ఆ విధంగా శాకుంతలం చిత్రానికి ఎన్టీఆర్ కూడా షాక్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.శాకుంతలం ఒక్క ఫ్లాప్ తో సమంత పై విమర్శలు వస్తున్నాయి .దర్శకుడిగా గుణశేఖర్ పరిస్థితి కూడ అయోమయంగా మారింది .మొత్తంగా ఒక్క ప్లాన్ ఎఫెక్ట్ పలువురు కెరియర్ పై పడుతుంది .








