తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు.ఐకేపీ వీవోఏల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఐకేపీ వీవోఏలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు గుర్తింపు కార్డులు, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని లేఖలో విన్నవించారు.అదేవిధంగా ఐకేపీ వీవోఏలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరారు.