అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త.. ఈ ఏడాది వీసాల పంటే..!!

అమెరికా( America )… శాస్త్ర, సాంకేతిక, ఆర్ధిక రంగాల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న దేశం.అందుకే ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజల ఫైనల్ డెస్టినేషన్ అమెరికాయే.

 Us On Track To Issue More Than A Million Visas To Indians This Year: Official ,-TeluguStop.com

విద్య, ఉపాధి, వ్యాపార అవకాశాల కోసం ప్రతి ఏటా అగ్రరాజ్యానికి వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది.ఏదో ఒక రకంగా అమెరికాలో స్థిరపడి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ప్రపంచం భావిస్తోంది.

ఇందులో భారతీయులు సైతం వున్నారు.అక్కడి వలసదారుల్లో అత్యంత శక్తివంతమైన, బలమైన కమ్యూనిటీ ఇండియన్సే.

అందుకే అప్పు చేసైనా సరే తమ పిల్లలను అమెరికా పంపిస్తున్నారు తల్లిదండ్రులు.

Telugu America, Donald Lu, Germany, Visa, Indians, Joe Biden, Julie Stufft, Visa

అయితే అమెరికాపై అన్ని దేశాలకు మోజు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ ఎక్కువైంది.దీంతో వీసాల జారీ అమెరికాకు కత్తి మీద సాములా తయారైంది.ఈ విషయంలో తమకు కోటా పెంచాలంటూ భారత్, చైనా సహా ఎన్నో దేశాలు అగ్రరాజ్యం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి.

ఇటు స్థానికులకు అన్యాయం జరుగుతుందని హెచ్ 1 బీ వీసాల జారీని కఠినతరం చేయాలని స్వదేశంలో కొన్ని పక్షాల ఆందోళనలు సైతం ఫెడరల్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.

Telugu America, Donald Lu, Germany, Visa, Indians, Joe Biden, Julie Stufft, Visa

ఇలాంటి పరిస్ధితుల్లో అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త .ఈ ఏడాది మనదేశానికి చెందిన వారికి మిలియన్‌కు పైగా వీసాలు జారీ చేయాలని అమెరికా కృతనిశ్చయంతో వుందని ఓ సీనియర్ అధికారి మీడియాకు తెలిపారు.దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాలను పర్యవేక్షించే యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డొనాల్డ్ లూ( Donald Lu ) ఈ వారం జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వివరాలు తెలిపారు.

భారత్‌ నుంచి స్టూడెంట్, వర్క్ వీసాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.వీటిలో హెచ్ 1 బీ, ఎల్ వీసాలు కూడా వున్నాయన్నారు.ఈ వేసవిలో భారతీయుల విద్యార్ధి వీసాలను ప్రాసెస్ చేసేందుకు అమెరికా కట్టుబడి వుందని డొనాల్డ్ చెప్పారు.ఈ వీసాల కోసం భారత్‌లోని తమ దౌత్య కార్యాలయాల్లో వేచి వుండే సమయం 60 రోజుల కంటే తక్కువగానే వుందని ఆయన తెలిపారు.

Telugu America, Donald Lu, Germany, Visa, Indians, Joe Biden, Julie Stufft, Visa

అంతకుముందు గత నెలలో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ వీసా సర్వీసెస్ జూలీ స్టఫ్ట్( Julie Stufft ) పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు ప్రస్తావించారు.ఈ ఏడాది 1 మిలియన్ వీసాలను జారీ చేయాలన్నది తమ లక్ష్యమని ఆమె తెలిపారు.భారతదేశానికి కాన్సులర్ అధికారుల కేడర్‌ను పంపపడంతో పాటు వీసా దరఖాస్తుదారుల కోసం జర్మనీ, థాయ్‌లాండ్‌( Germany )లలో రాయబార కార్యాలయాలను తెరుస్తున్నట్లు ఆమె తెలిపారు.ప్రధానంగా భారత్‌లో వీసా నిరీక్షణ సమయాన్ని తొలగించేందుకు అమెరికా ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube