మహేష్ బావ సుధీర్ బాబు( Sudheer Babu ) నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.ప్రస్తుతం అతను చేస్తున్న సినిమా మామా మశ్చీంద్ర( Mama Mashindra ).
హర్షవర్ధన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది.ఈ టీజర్ చూస్తే సుధీర్ బాబు ఈసారి పెద్ద ప్రయోగమే చేశాడని అనిపిస్తుంది.
ముఖ్యంగా సుధీర్ బాబు 3 విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.సుధీర్ బాబు కెరీర్ లో ఫస్ట్ టైం ఇలాంటి వేసధారణ చేశాడు.

ఇక టీజర్ విషయానికి వస్తే కొద్దిగా కన్ ఫ్యూజింగ్ గా అనిపించినా సబ్జెక్ట్ మాత్రం ఉన్నట్టుగా ఉంది.మరీ ముఖ్యంగా తన పాత్రల వేరియేషన్స్ తో సుధీర్ బాబు సత్తా చాటాలని చూస్తున్నాడు.సుధీర్ బాబుకి ఈ మామా మశ్చీంద్ర సినిమా కెరీర్ బెస్ట్ హిట్ గా నిలుస్తుందా లేదా అన్నది చూడాలి.ఈ సినిమాలో మృణాలిని రవి( Mrinalini Ravi ), ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించారు.
ఈ సినిమాకు పిజి విందా కెమెరా మెన్ గా పనిచేయగా చైతన్ భరధ్వాజ్ మ్యూజిక్ అందించారు.సినిమా ఫలితాలు ఎలా ఉన్నా తన వరకు సినిమాకు పూర్తి న్యాయం చేస్తూ వస్తున్న సుధీర్ బాబు ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.







