క్యాబ్ డ్రైవర్ గా పని చేసిన జేమ్స్ కెమెరాన్ డైరెక్టర్ ఎలా అయ్యాడంటే..?

ఒక సినిమాని ప్రేక్షకుడు చూస్తుంటే స్క్రీన్ మీద ఆర్టిస్ట్ లు మాత్రమే కనిపిస్తారు కానీ ఆ సినిమా తీయడానికి ఒక డైరెక్టర్ తెర వెనక ఎన్ని కష్టాలు పడతాడు అనేది చాలా మందికి తెలీదు.అయితే డైరెక్టర్( Director ) కష్టాలు పక్కన పెడితే ఒక సినిమా తీసే డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి అని చాలా మందికి ఒక సందేహం ఉంటుంది.

 How Did James Cameron, Who Worked As A Cab Driver, Become A Director , James Cam-TeluguStop.com

ఇలాంటి సందేహాలన్నింటికీ చెక్ పెడుతూ అవతార్ సినిమా( Avatar movie ) ద్వారా డైరెక్టర్ అంటే ఇలా ఉండాలి అని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితం గా జేమ్స్ కెమరూన్( James Cameron ) అనే చెప్పాలి.ఎందుకంటే అవతార్ సినిమా 1999 లోనే రావాల్సింది కానీ అప్పుడు ఆ సినిమా తీసేందుకు అవసరం అయిన మోషన్ పిక్చర్ టెక్నాలజీ( Motion picture technology ) రాకపోవడంతో దాని కోసం వెయిట్ చేసి మరి ఆ సినిమా తీశారు మొదట మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ తీసుకు వచ్చిన డైరెక్టర్ కూడా కెమరూన్ గారే… ఆయన గురించి మనం ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

1954 ఆగష్టు 16 న కెనడా లోని ఒంటిరియలో ఫిలిప్ కెమరూన్, శిల్లె కెమరూన్( Philip Cameron, Shille Cameron ) కి పుట్టిన వ్యక్తే జేమ్స్ కెమరూన్…కెమరూన్ కి చిన్నప్పుడు స్కూల్ లో చదువుకుంటున్నప్పుటి నుంచే సైన్స్ ఫిక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండేది.తను స్కూల్ జీవితం అయిపోయాక కాలేజీలో జైన్ అయ్యాడు కెమరూన్ ఏమయిందో కానీ ఎగ్జామ్స్ రాయకుండానే ఆ కాలేజ్ నుంచి బయిటికి వచ్చేసాడు…సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండే కెమరూన్ అటు క్యాబ్ డ్రైవర్ గా చేస్తూనే టైం దొరికినపుడు స్టోరీస్ రాసుకునే వాడు ఇంత వరకు ఓకే కానీ అతనికి ఎదో తెలియని అసంతృప్తి ఉండేది తన జీవితం క్యాబ్ డ్రైవర్ గానే క్లోజ్ అవుతుందేమో అని భయపడేవాడు ఒక టైం లో స్టార్ వార్ సినిమా( War movie ) చూసి అది బాగా నచ్చడం తో ఇక ఎలాగైనా తాను సినిమాల్లోకి వెళ్ళాలి డైరెక్టర్ అవ్వాలి అనుకోని ముందుకు సాగాడు.

 How Did James Cameron, Who Worked As A Cab Driver, Become A Director , James Cam-TeluguStop.com

1978 వ సంవత్సరం లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక షార్ట్ ఫిలిం తీయాలి అనుకున్నాడు కానీ షార్ట్ ఫిలిం తీసేంత బడ్జెట్ అతని దగ్గర లేదు అయితే షార్ట్ ఫిలిం తీయాలంటే కెమెరా గురించి తెల్సుకోవాలి అని ముందుగా దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాడు ఆలా కెమెరా మీద అవగాహనా వచ్చాక తనకు తెలిసిన ఒక డెంటిస్ట్ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకొని ఒక షార్ట్ ఫిలిం తీసాడు…అయితే కెమరూన్ కి ఈ షార్ట్ ఫిలిం తో మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది.ఆ తర్వాత రాక్ అండ్ రోల్ హై స్కూల్ ( Rock and Roll High School )అనే సినిమా కి ప్రొడక్షన్ అసిస్టెంట్ గా వర్క్ చేసాడు ఇలా కొన్ని సినిమాలకి అన్ని విభాగాల్లో వర్క్ చేస్తూ వచ్చాడు .

Telugu Avatar, James Cameron, Picture, Philip Cameron, Shille Cameron, War-Movie

1982 వ సంవత్సరంలో ఫిరన్న సీక్వల్ తీయడానికి అవకాశం వచ్చింది ముందు ఉన్న డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ తో గొడవ జరిగి డైరెక్టర్ సినిమా నుంచి తప్పుకోవడం వల్ల కెమరూన్ కి అవకాశం వచ్చింది ఈ మూవీ రోమ్ లో షూట్ చేసారు ఈ సినిమా షూటింగ్ టైములో కెమరూన్ కి జ్వరం వచ్చి పడుకున్నప్పుడు తన కలలోకి ఒక రోబో వచ్చి తనని చంపబోతున్నట్టు అనిపించింది దెబ్బకి లేచి కూర్చొని ఇదే కథ తో సినిమా చేస్తే ఎలా ఉంటుంది అని ఊహించుకున్నాడు.అలాగే ది టెర్మినేటర్ ( The Terminator )పేరు తో సినిమా కూడా తీసాడు ఈ సినిమా 1984 వ సంవత్సరం అమెరికా లో ఈ మూవీ రిలీజ్ అయింది దెబ్బకి బాక్స్ ఆఫీస్ రికార్డులు మొత్తం మారిపోయాయి.

Telugu Avatar, James Cameron, Picture, Philip Cameron, Shille Cameron, War-Movie

ఇక అప్పటి నుంచి కెమరూన్ వెనక్కి తిరిగి చూడకుండా చాలా సినిమాలు తీస్తూ వస్తున్నాడు.అలాగే టెర్మినేటర్ కి సీక్వల్ గా టెర్మినేటర్ 2 సినిమా కూడా తీసాడు ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది.తర్వాత ఏలియన్ లాంటి సినిమాలు తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఇక తానే స్వయంగా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఎక్కువ బడ్జెట్ తో సినిమాలు తీయాలని అనుకోని టైటానిక్ సినిమా తీసి నిజమైన ప్రేమకి ఒక అర్థాన్ని చెప్పారు అలాగే అవతార్ లాంటి సినిమా తీసి ప్రపంచం మొత్తంలో తనే టాప్ డైరెక్టర్ అని నిరూపించుకున్నాడు అలాగే ఫ్రెష్ థాట్స్ తో సినిమాలు తీస్తున్న డైరెక్టర్ గా కూడా చరిత్ర లో నిలిచారు.దాంట్లో భాగంగానే అవతార్ వచ్చిన 13 ఎండ్లకి అవతార్ 2 సినిమా తో వచ్చి జనాలందరినీ అలరిస్తున్నారు…

Telugu Avatar, James Cameron, Picture, Philip Cameron, Shille Cameron, War-Movie

కెమరూన్ కి మొత్తం 21 అకాడమీ అవార్డ్స్, 7 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, 5 బి ఏ ఎఫ్ టి అవార్డ్స్ వచ్చాయి ఇప్పుడు అవతార్ 2 సినిమాకి కూడా చాలా అవార్డ్స్ వస్తాయి అని చెప్పవచ్చు.ఇక ఆయన భార్యల విషయానికి వస్తే కెమరూన్ ఐదు పెళ్లిళ్లు చేసుకున్నారు.1974 జేమ్స్ కెమరూన్ కి శరన్ విలియమ్స్ కి మ్యారేజ్ అయింది కాకపోతే 1984 వీళ్లిద్దరు విడిపోయారు ఆ తరువాత గేల్ అన్నే హౌర్ ని 1985 లో పెళ్లి చేసుకున్నారు ఈమె టెర్మినేటర్ సినిమా ప్రొడ్యూసర్ అండ్ కో రైటర్ కూడా 1989 లో మళ్ళి వీళ్లిద్దరు విడిపోయారు…

Telugu Avatar, James Cameron, Picture, Philip Cameron, Shille Cameron, War-Movie

విడిపోయిన సంవత్సరం లోనే కేథరిన్ ని పెళ్లి చేసుకున్నాడు కెమరూన్, 1991 లిండా హామిలిటన్ ని పెళ్లి చేసుకున్నారు వీళ్ళతో కూడా బేధాభిప్రాయాలు రావడం తో వాళ్ళ నుంచి విడిపోయి 2000 ల సంవత్సరంలో సుజి అమిస్ ని పెళ్లి చేసుకున్నారు ప్రస్తుతం వీళ్లిద్దరు కలిసి ఉంటున్నారు…రీసెంట్ గా అవతార్ 2 సినిమాతో వరల్డ్ వైడ్ గా సందడి చేస్తున్న జేమ్స్ కెమరూన్ గారు ఫ్యూచర్ లో ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుందాం…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube