ఏజ్ బార్ అవుతున్నా సరే హీరోయిన్ శ్రీయ( Shriya ) ఇప్పటికీ ఏమాత్రం తగ్గట్లేదని చెప్పొచ్చు.పెళ్లై ఒక పాప కూడా ఉన్న శ్రీయ తన ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.
సినిమాల్లో కూడా అమ్మడు తన ఫాం కొనసాగిస్తుంది.ఇక లేటెస్ట్ గా శ్రీయ చిరుతో ( Chiranjeevi ) ఒక స్పెషల్ ఐటం సాంగ్ చేస్తుందని టాక్.
భోళా శంకర్( Bhola Shankar ) సినిమాలో శ్రీయ స్పెషల్ సాంగ్ ఉంటుందట.

ఈ సాంగ్ తో శ్రీయ మరోసారి రెచ్చిపోవాలని ఫిక్స్ అయ్యిందట.పుష్ప సినిమాలో సమంత చేసిన ఉ అంటావా మావ సాంగ్ ని బీట్ చేసేలా శ్రీయ అందాల రచ్చ చేయాలని చూస్తుంది.శ్రీయ ఫోటో షూట్స్ తోనే పిచ్చెక్కించేస్తుంది.
అలాంటిది ఐటం సాంగ్ అంటే అదిరిపోవాల్సిందే.

మెగాస్టార్ తో ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన శ్రీయ ఇప్పుడు ఆయన సినిమాలో ఐటం సాంగ్ కు రెడీ అవుతుంది.సమంత ని బీట్ చేయాలనే టార్గెట్ తోనే శ్రీయ ఈ సాంగ్ లో మరింత రెచ్చిపోవాలని అనుకుంటుందట.భోళా శంకర్ సినిమా ఈ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో తమన్నా, కీర్తి సురేష్ నటిస్తున్నారు.







