మహేష్ బాబు ( Mahesh Babu )కూతురు సితార మల్టీ టాలెంటెడ్ అనే సంగతి తెలిసిందే.సితారకు సంబంధించి సోషల్ మీడియాలో ఏదైనా ఫోటో, వీడియో షేర్ అయినా ఆ ఫోటో, వీడియో క్షణాల్లో వైరల్ అవుతోంది.
చిన్న వయస్సులోనే ప్రశంసలు అందుకుంటున్న సితార( Sitara ) రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని ఇందుకు సంబంధించి సందేహాలు అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే మహేష్ బాబు కూతురు సితారకు అలియాభట్( Aliabhat ) నుంచి అదిరిపోయే గిఫ్ట్ అందింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన అలియా భట్ ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల కిడ్స్ కు దుస్తులను పంపడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా అలియా భట్ సితారకు దుస్తులు పంపగా అందుకు సంబంధించిన ఫోటోలను సితార సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది.
కొన్నిరోజుల క్రితం తారక్ కొడుకులకు దుస్తులు పంపి ఆశ్చర్యపరిచిన ఈ బ్యూటీ ప్రస్తుతం మహేష్ కూతురికి దుస్తులు పంపడం గమనార్హం.

సితార తన పోస్ట్ లో మీ కుటుంబంలో భాగం కావడం సంతోషంగా ఉందని మీ అందరికీ నా ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు.అలియా భట్ తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయకపోయినా తెలుగు ప్రేక్షకులు అభిమానించే హీరోల పిల్లలకు బహుమతులు పంపించడం ద్వారా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.అలియా భట్ మనస్సు మంచి మనస్సు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు అలియా భట్ రణ్ బీర్ కపూర్ ( Alia Bhatt Ranbir Kapoor )దంపతులు సంతోషంగా ఉన్నారు.పెళ్లి తర్వాత కూడా అలియా భట్ పలు బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీ అవుతున్నారు.అలియా భట్ రణ్ బీర్ కపూర్ దంపతుల కూతురు పేరు రాహా అనే సంగతి తెలిసిందే.కెరీర్ పరంగా అలియా భట్ ఆచితూచి అడుగులు వేస్తుండటం గమనార్హం.
అలియా భట్ గ్రేట్ అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







