టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) తాజాగా నటించిన చిత్రం శాకుంతలం( Sakunthalam ).ఇందులో మలయాల నటుడు దేవ్ మోహన్ ( Dev Mohan )హీరోగా నటించిన విషయం తెలిసిందే.
గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా విడుదలైంది.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.
ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది.సినిమా ఫ్లాప్ అవడంతో కొంతమంది సమంత పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

నెగిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా రిజల్ట్ పై స్పందించిన బిగ్ బాస్ బ్యూటీ ఆరోహి రావ్( Arohi Rao ) శాకుంతలం సినిమా ఫ్లాప్ అవ్వడానికి నాగచైతన్య( Naga Chaitanya ) అభిమానులే కారణం అని అంటుంది.వివరాల్లోకి వెళితే.ఈ సినిమా రిజల్ట్ పై స్పందించిన ఆరోహి సందర్భంగా మాట్లాడుతూ.శాకుంతలం సినిమా కొంచెం లాగ్ ఉండడం నిజమే.పురాణాల గురించి తెలియని వారికి ఈ సినిమా పంచతంత్రం కథలాగే కనిపిస్తుంది.
ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి నాగచైతన్య అభిమానులు కూడా ఒకరకంగా కారణం.సమంత నటన బాగాలేదని చెప్పిన వారు నాగచైతన్య అభిమానులే.
అన్నది తీశారు కాబట్టే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.

కొంచెం ఫిక్షన్ మసాలా జోడిస్తే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఆరోహి.అనంతరం అల్లు అర్హ గురించి స్పందిస్తూ అర్హత చాలా బాగుంది కానీ అర్హకంటే అద్భుతంగా చేస్తూ అవకాశాల కోసం చూసేటోళ్లు చాలామంది ఉన్నారు.మొత్తంగా చెప్పాలి అంటే యావరేజ్ మూవీ.
ఫ్లాప్ అయితే కాదు నా వరకు అని తెలిపింది ఆరోహి.కాగా ఆరోహి చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే ఈ సినిమా విషయానికి వస్తే.ఈ సినిమా విడుదలైన మొదటి రోజే నెగటివ్ రివ్యూలు మిశ్రమ స్పందన రావడంతో చాలామంది ప్రేక్షకులు థియేటర్కు వెళ్లడమే మానేశారు.







