మెగా హీరో సాయిధరమ్ తేజ్( Saidharam Tej ) యాక్సిడెంట్ తర్వాత చిన్న గ్యాప్ తీసుకుని నటించిన చిత్రం విరూపాక్ష.సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ప్రముఖ దర్శకుడు సుకుమార్( Sukumar ) వ్యవహరించడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.
చేతబడి కాన్సెప్ట్ తో 1990 కాలం నాటి పీరియాడిక్ డ్రామా కథ తో రూపొందిన విరూపాక్ష చిత్రాన్ని రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.గత రెండు వారాలుగా చిత్ర యూనిట్ సభ్యులు పెద్ద ఎత్తున సినిమాకు ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.
హీరో హీరోయిన్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు.ఈ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ కచ్చితంగా ఇండస్ట్రీలో స్టార్ డం సొంతం చేసుకుంటాను అంటూ నమ్మకంగా చెప్తున్నాడు.
ఈ సినిమా లోని పాత్రలను విభిన్నంగా పరిచయం చేయడం తో పాటు ప్రతి పాత్రకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.
![Telugu Sai Dharam Tej, Samyukta Menon, Telugu, Virupaksha-Movie Telugu Sai Dharam Tej, Samyukta Menon, Telugu, Virupaksha-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/04/sai-dharam-tej-samyukta-menon-virupaksha-movie-previewa.jpg)
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ వల్ల అయిన గాయాల నుండి పూర్తిగా కోలుకోక ముందే ఈ సినిమాను ప్రారంభించారు.దాదాపు సంవత్సరం పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ నిర్వహించి ఈ సినిమాను రూపొందించినట్లుగా హీరోయిన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.తెలుగులో సూపర్ హిట్ సినిమాలైన అన్వేషణ కాష్మోరా తులసిదళం వంటి సినిమాల రేంజ్ లో ఈ సినిమా ఉండబోతోంది అంటూ యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.
ఈ మధ్య కాలంలో చేతబడి కాన్సెప్ట్ తో సినిమాలు రాలేదు.కనుక ప్రేక్షకులు ఈ సినిమా ను ఆదరిస్తారనే నమ్మకం ఉందంటూ మేకర్స్ పేర్కొన్నారు.సుకుమార్ ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉండటం వల్ల కచ్చితంగా పాజిటివ్ బజ్ దక్కింది అనడంలో సందేహం లేదు.దాంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం.
సినిమా బాగుంటే తప్పకుండా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ నమోదు అవ్వడం కూడా ఖాయం.దాదాపు రూ.25 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ.30 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో విడుదల కాబోతుంది.మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.