ఓ యువకుడు బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూ.20 వేల ఖర్చుతో రూపొందించి అందరి ప్రశంసలు పొందుతున్నాడు.ఈ బ్యాటరీ సైకిల్( Battery Cycle ) ప్రత్యేకత ఏమిటి అంటే.10 పైసల ఖర్చుతో ఒక కిలోమీటర్ ప్రయాణం చేయవచ్చు.అంతేకాదు 100 కేజీల బరువును కూడా సైకిల్ మోస్తుందట.ఈ సైకిల్ కి సంబంధించిన విశేషాలు ఏమిటో చూద్దాం.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని( Madhya Pradesh ) ఛతర్ పుర్ జిల్లాకు చెందిన ఆదిత్య శివ్ హరే (20) అనే యువకుడికి చిన్నప్పటినుండి కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

తాను చేసే ఆవిష్కరణ పేదలకు ఉపయోగకరంగా ఉండాలనే కారణంతో ఈ సైకిల్ ను ప్రత్యేకంగా రూపొందించాడు.నెల రోజులు నిరంతరం శ్రమించి ఈ సైకిల్ తయారు చేశాడు.ఈ సైకిల్ తయారు చేయడానికి రూ.20 వేల రూపాయలు ఖర్చు అయ్యాయట.ఒకసారి చార్జింగ్ చేస్తే 30 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.
పైగా కిలోమీటర్ దూరానికి 10 పైసలు మాత్రమే ఖర్చు అవుతుందని ఆదిత్య తెలిపాడు.ఈ సైకిల్ కు బైకు ఉండే యాక్స్ ల రేటర్, బ్రేక్స్, హరన్, లైట్, మొబైల్ స్టాండ్ ను ఏర్పాటు చేశాడు.
నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజల్ రేట్లు ఒక సమస్య అయితే.

వివిధ కంపెనీల నుండి వస్తున్న ఎలక్ట్రిక్ బైక్ ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.ఈ క్రమంలో కాస్త వినూతంగా ఆలోచించి పేదవారికి ఉపయోగపడే విధంగా సైకిల్ తయారు చేసినట్లు ఆదిత్య తెలిపాడు.తాను కొత్తగా తయారు చేసిన ఈ బ్యాటరీ సైకిల్ కు A-1 అని నామకరణం చేశాడు.
అంతేకాకుండా ఆదిత్య తనకు పదహారేళ్ళ వయసు ఉన్నప్పుడే వైర్లు లేకుండా విద్యుత్తు తయారు చేసినట్లు తెలిపాడు.చిన్నప్పటినుండి ఆదిత్య కు( Aditya ) యంత్రాలు వేరు చేసి బిగించడం అలవాటు అంటు అతని తల్లి విమల శివ్ హరే తెలిపింది.







