వైరల్: రూపాయి కాయిన్లతో సాధారణ కారుని బుల్లెట్ ప్రూఫ్ కారుగా మార్చేసిన యజమాని?

కాదేది కవితకు అనర్హం అన్నట్టు, ఆలోచన ఉండాలేగాని సాధారణమైన విషయాన్నీ కూడా అసాధారణ విషయంగా మార్చొచ్చు.అవును, చాలా మంది తమ తెలివితేటలతో రకరకాల ప్రయోగాలు చేసి ఇతరులను మెప్పిస్తూ వుంటారు.

 Viral: The Owner Who Converted An Ordinary Car Into A Bulletproof Car With Rupee-TeluguStop.com

అయ్యో మనకు ఈ ఐడియా రాలేదే అని ఆశ్చర్యపోయేలా చేస్తారు.అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అలాంటి వారి ప్రతిభ ఎక్కువ మందికి రీచ్ అవుతోందని చెప్పుకోవాలి.

ఇపుడు అలాంటి ఓ వ్యక్తికి సంబంధించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా ఓ వ్యక్తి తన స్విఫ్ట్ డిజైర్ కారు( Swift Dzire car )ను వినూత్నంగా సిద్ధం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మన నెటిజన్లు ఆ కారుని చూసి షాకవుతున్నారు.అదేమన్నా విదేశాలనుండి దిగుమతి చేసుకున్న స్పోర్ట్స్ కారు( Sports car ) మాదిరిగా ఉందని అంటున్నారు.విశాల్ ఎక్సపెరిమెంటింగ్ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ చేయగా కొన్ని లక్షలమంది సదరు వీడియో చూసి అవాక్కవుతున్న పరిస్థితి.

ఇక వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ కారు ధగదగా మెరిసిపోతూ ఉండడం మనం చాలా స్పష్టంగా చూడవచ్చు.

తీరా దగ్గరకు దానిని జూమ్ చేసి చూపించేసరికి మనకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది.విషయం ఏమంటే ఆ కారు మొత్తం రూపాయి కాయిన్లతో( rupee coins ) నిండిపోయి ఉండడం గమనించవచ్చు.కారు బాడీ మీద అద్దాలతో సహా ఆ వ్యక్తి మొత్తం రూపాయి కాయిన్లు అతికించడం అందులో చూడవచ్చు.

ఈ వీడియోను ఇప్పటివరకు ఏకంగా 31 కోట్ల మంది చూడడం విశేషం.కాగా 22 లక్షల మంది లైక్ చేయడం చూడవచ్చు.చాలా మంది ఆ వ్యక్తి ఐడియాను ప్రశంసిస్తూ కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.ఓనర్ తన సాధారణ స్విఫ్ట్ కారును బుల్లెట్ ప్రూఫ్ కారులా మార్చేశాడు అని కొందరంటే బాలీవుడ్ హాట్ గాళ్ ఉర్ఫీ జావేద్ ఈ ఐడియా ఇచ్చి ఉంటుంది అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Man covered the entire car with coins

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube