స్మార్ట్ వాచ్( Smart Watch ) కొనుక్కోవాలని ఎవరు మాత్రం కోరుకోరు.కానీ ఎంత ధరకు? అందుబాటులో ధరలు ఉండాలి.పైగా వారంటీ మనకు దండిగా కావాలి.అయితే ఈ కాంబినేషన్ దాదాపుగా కుదరదు.ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు వారంటీ కావాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సిందే.అయితే ఇపుడు ఆ బాధ లేదు.
మీరు కోరుకుంటున్నట్టు, మీ కలల స్మార్ట్ వాచ్ ఇపుడు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.అవును, వినడానికి విడ్డూరంగా వున్నా మీరు విన్నది నిజమే.
బడ్జెట్ ధరలోనే ఇపుడు కిర్రాక్ లుక్‌తో ఉన్న స్మార్ట్ వాచ్ పైగా ఎక్కువ వారంటీతో వస్తోంది.

విషయంలోకి వెళితే ఈ కామర్స్ దగ్గజాల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న అమెజాన్( Amazon )లో స్మార్ట్ వాచ్‌పై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది.అమెజాన్‌లో టెక్‌కింగ్ డీ 116 ఇంటెలిజెన్స్ బ్లూటూత్ స్మార్ట్‌వాచ్( TechKing ) అందుబాటులో ఉంది.ఈ స్మార్ట్ వాచ్ ఎంఆర్‌పీ రూ.2,999గా కాగా ఇప్పుడు దీన్ని కేవలం రూ.1195కే సొంతం చేసుకోవచ్చు.అంటే దీనిపై 60 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.అలాగే కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది.కూపన్ ద్వారా రూ.50 అదనపు తగ్గింపు లభిస్తోంది.అంటే మొత్తంగా మీరు రూ.1145కే ఈ స్మార్ట్ వాచ్ మీ ఇంటికి తీసుకుపోవచ్చు.

ఈ స్మార్ట్ వాచ్ ఫీచర్లు విషయానికొస్తే… ఈ స్మార్ట్ వాచ్‌పై ఏకంగా 6 ఏళ్ల వరకు వారంటీ లభించడం ఇక్కడ గొప్ప విషయం.స్మార్ట్ నోటిఫికేషన్స్ ఫీచర్, ఎస్ఎంఎస్, కాల్స్, వాట్సాప్, ఇతర యాప్స్‌కు సంబంధించి ఏమైనా అలర్ట్స్ మనకు కనిపిస్తాయి.1.3 ఇంచుల స్క్రీన్, హై సెన్సిటివిటీ టచ్, క్లియర్ డిస్‌ప్లే వంటి ఫీచర్లు మెండుగా ఉన్నాయి.కెమెరా, స్మార్ట్ రిమోట్ రిమైండర్, స్టెప్స్, మ్యూజిక్, స్లీప్ మానిటరింగ్, క్యాలరీస్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.ఇక రియల్ టైమ్ హార్ట్ రేటు మానిటరింగ్ ఇందులో ఉండడం విశేషం.
ఇంకా ఇందులో రిమోట్ క్యాప్చర్, మ్యూజిక్ ప్లేయర్, అలారం క్లాక్, క్యాలెండర్ వంటివి కూడా ఉంటాయి.డైరెక్ట్‌గా యూఎస్‌బీ చార్జర్ పెట్టుకోవచ్చు.అందువల్ల మీరు కొత్త స్మార్ట్ వాచ్ కొనే ప్లానింగ్‌లో ఉంటే మాత్రం దీన్ని ఒకసారి పరిశీలించొచ్చు.







