పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ( Prabhas ) స్టార్ డమ్ గురించి అందరికి తెలిసిందే.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా ఫాలోయింగ్ తెచ్చుకున్న మొదటి తెలుగు హీరో ప్రభాస్ కావడం విశేషం.
ఇక ఈయన బాలీవుడ్ స్టార్ హీరోలను సైతం రేసులో వెనక్కి నెట్టడమే కాకుండా ఈ మూవీ ఇచ్చిన క్రేజ్ తో ప్రభాస్ ప్రెజెంట్ అన్ని వందల కోట్ల ప్రాజెక్టులను చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఇక ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ‘ఆదిపురుష్‘ ( Adipurush ) ఒకటి.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించాడు.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ( Kriti Sanon ) సీతగా నటించింది.
అలాగే సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan ) రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.

ఈ సినిమా కోసం ప్రభాస్ ముందు నుండి చాలా కష్టపడ్డాడు.రాముడి పాత్రలో ‘వి’ షేప్ లో కనిపించడం కోసం చాలా శ్రమించాడు అని టీమ్ చెబుతుంది.ఇంకా విలు విద్యలో కూడా శిక్షణ తీసుకున్నాడు. రామాయణం తెరకెక్కించడం కోసం బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి సిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల పెట్టుబడి పెట్టినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తుంది.

ఈ సినిమా ఓవర్సీస్ డీల్ పూర్తి అయినట్టు సమాచారం.గత కొన్నాళ్ల నుండి ఓవర్సీస్ మార్కెట్ లో ఈ డీల్ ఎవరు సొంతం చేసుకుంటారు అనే దానిపై చర్చ జరుగుతూనే ఉంది.ఇక ఇప్పుడు ఫైనల్ గా క్లారిటీ అనేది తెలుస్తుంది.
ఈ సినిమాను ఓవర్సీస్ ( Overseas rights ) మార్కెట్ లో ప్రముఖ సంస్థ ఏఏ ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.చూడాలి ఈ సినిమా ఎన్ని అంచనాలను అందుకుంటుందో.







