సమ్మర్ ఒంటిమీద చురకలు పెడుతోంది.ఎండలు ముదిరి కొన్ని కొన్ని చోట్ల వడగాల్పులకు మనుషులు చనిపోయిన పరిస్థితిని చూస్తున్నాం.
ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ‘నిస్సాన్ ఇండియా( Nissan Motor India ) ‘ అదిరే ఆఫర్ తన వినియోగదారులకోసం తీసుకు వచ్చిందని చెప్పుకోవచ్చు.విషయం ఏమంటే, ఈ మండుటేసవిలో కంపెనీ ఉచిత ఏసీ చెకప్ క్యాంపులు నిర్వహిస్తోంది.
అందువల్ల నిస్సాన్ లేదా డస్టన్( Nissan Car ) కారు కొనుగోలు చేసిన వారు ఉచితంగానే వారి ఏసీని చెక్ చేయించుకోవచ్చు ఇపుడు.
ఏప్రిల్ 15 నుంచి ఈ ఉచిత ఏసీ సర్వీస్( AC Checkup ) అనేది దిగ్విజయంగా ప్రారంభం అయ్యింది.జూన్ 15 వరకు ఈ ఉచిత సేవలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
అందువల్ల కంపెనీ కారు కలిగిన వారు వెంటనే ఈ బెనిఫిట్ పొందవచ్చు.అంతేకాకుండా కస్టమర్లకు ఇతర బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.లేబర్ చార్జీల మీద 20 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
ఏసీ సర్వీసులకు ఇది వర్తిస్తుంది కూడా.ఇంకా వాల్యూ యాడెడ్ సర్వీసులపై అయితే 10 శాతం వరకు తగ్గింపు ఉంటుంది.
సర్వీస్ క్యాంప్‌లో ఈ బెనిపిట్స్ పొందొచ్చు.
నిస్సాన్ చెప్పిన వివరాలు ప్రకారం చూస్తే.శిక్షణ పొందిన మంచి స్కిల్డ్ వర్కర్లు కారుకు 20 చెకప్స్ చేస్తారు.ఇందులో ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్, అండర్ బాడీ, ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్, రోడ్ టెస్ట్ వంటివి చేస్తారు.
అలాగే సర్వీస్ క్యాంప్‌లో టాప్ వాష్ కూడా ఉచితంగానే చేసి పెడతారు.అంతే కాకుండా కంపెనీ ప్రిమెయింటెనెన్స్ ప్యాకేజ్ కూడా అందిస్తోంది.నిస్సాన్ ఆథరైజ్డ్ వర్క్‌షాప్స్ వద్దకు వెళ్లి కూడా మీరు మీ కారును చెక్ చేసుకోవచ్చు.నిస్సాన్ కనెక్ట్ యాప్ లేదా నిస్సాన్ మోటార్ ఇండియా వెబ్సైట్ ద్వారా కస్టమర్లు సర్వీస్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.