యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ ”NTR30”.అగ్ర దర్శకుల మధ్య ఈ మధ్యనే గ్రాండ్ లాంచింగ్ చేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొన్నాళ్లకే రెగ్యురల్ షూట్ కూడా స్టార్ట్ అయ్యింది.
అయితే తారక్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు.
కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చాలా రోజుల పాటు షూట్ స్టార్ట్ అవ్వలేదు.
ఎట్టకేలకు లాంచ్ అవ్వడమే కాకుండా వెంటనే షూట్ కూడా స్టార్ట్ అవ్వడంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.ఇదిలా ఉండగా ఈ పాన్ ఇండియన్ సినిమా నుండి ఏదొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వస్తూనే ఉంది.
తాజాగా మరో అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్ ను ఢీ కొట్టబోయే విలన్ ఎవరు అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.కానీ ఇప్పటి వరకు ఈ సినిమాలో ఎవర్ని విలన్ గా ఫిక్స్ చేయలేదు.సైఫ్ అలీ ఖాన్ పేరు వినిపించిన ఇప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు.
కానీ ఈసారి ఎన్టీఆర్ సినిమా నుండి వచ్చిన పుకార్లు నెట్టింట వైరల్ అవుతున్నారు.

ఈ సినిమాలో విలన్స్ అందరిలో కల్లా పెద్ద విలన్ ఎన్టీఆరేనట.మంచి వాడు న్యాయం కోసం చేసే యుద్ధం కన్నా.చెడ్డ వాడు అన్యాయంపై చేసే యుద్ధమే ఎంతో గొప్పది అనే కోణంలో ఈ సినిమా సాగుతుంది.
అందరి కన్నా చెడ్డవాడు అన్యాయాన్ని ఎలా అంతం చేసాడు అనే కథాంశంతో ఈ కథ సాగుతుంది.
ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.
అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.








