మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కాంగ్రెస్ చర్చలు జరుపుతోంది.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తరపున సునీల్ కనుగోలు టీం వారితో సమావేశం అయిందని తెలుస్తోంది.
తాజా సర్వే వివరాలను పొంగులేటి, జూపల్లికి కనుగోలు టీం వివరించిందని సమాచారం.అదేవిధంగా కాంగ్రెస్ లో చేరితే కలిసి వచ్చే అంశాలపై చర్చలు జరుపుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ బలానికి పొంగులేటి వ్యక్తిగత బలం తోడైతే ఖమ్మంలో క్వీన్ స్వీప్ చేయొచ్చని సునీల్ అండ్ టీం సూచిస్తుంది.







