మహేష్ కు క్రేజీ డిసీజ్.. సూపర్ స్టార్ అది ఒప్పుకోవడం గ్రేటే!

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) సర్కారు వారి పాట సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత మహేష్ కొద్దిగా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా ప్రకటించాడు.

 Ssmb28 Movie Latest Update, Ssmb28, Mahesh Babu, Trivikram, Ssmb28 Update, Jagap-TeluguStop.com

మహేష్ హీరోగా పూజా హెగ్డే ( Pooja Hegde ), శ్రీలీల ( Sreeleela ) హీరోయిన్ లుగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”SSMB28”.

ఇప్పటికే వీరి కాంబోలో అతడు, ఖలేజా వంటి రెండు డిఫరెంట్ మూవీస్ వచ్చాయి.ఇక ఇప్పుడు మూడవ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

ఈ సినిమా సంక్రాంతి తర్వాత షూట్ స్టార్ట్ చేసుకుని గ్యాప్ లేకుండా షూటింగ్ జరుపు తున్నారు.ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ ను పూర్తి చేసి కొద్దిగా గ్యాప్ ఇచ్చారు.

ఇక మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నాడు.త్వరలోనే ఈ సినిమా షూట్ స్టార్ట్ కానుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి మహేష్ బాబు రోల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కు ఒక క్రేజీ డిసీజ్ ఉంటుందట.

ఈ డిసీజ్ ఇంటర్వెల్ లో రివీల్ అవుతుంది అని ఈ డిసీజ్ కథను పూర్తిగా మలుపు తిప్పుతుంది అని సెకండాఫ్ మొత్తం ఈ డిసీజ్ చుట్టూనే తిరుగుతుంది అని తెలుస్తుంది.

మొత్తానికి ఈసారి త్రివిక్రమ్ ఈ కథ కోసం చాలా కసరత్తులు చేసినట్టు అనిపిస్తుంది.ఏది ఏమైనా ఇలాంటి డిసీజ్ లను సూపర్ స్టార్ మహేష్ లాంటి వారు అంగీకరించడం దానిని చేయడం గ్రేట్ అనే చెప్పాలి.ఇదిలా ఉండగా ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.

థమన్ సంగీతం అందిస్తున్నారు.కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube