రష్యా, ఉక్రెయిన్( Russia, Ukraine ) యుద్ధం మొదలై సంవత్సరం దాటిపోయింది.అయినా నేటికీ ఇరు దేశాలూ నిరాటంకంగా పోరాడుతున్నాయి.
అయితే త్వరలోనే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగియనుందని కొన్ని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.కాగా దీన్ని ఉక్రెయిన్ కొట్టి పారేయడం గమనార్హం.
మరి అమెరికా ఇలా రాయించిందో, లేక రష్యా అనుకూల పత్రికలు రాశాయో తెలీదు కానీ, ఉక్రెయిన్ – రష్యా యుద్ధం మాత్రం ఈ మే చివరికి అయిపోతుందనే విషయాన్ని కొన్ని పత్రికలు కధానాలుగా రాశాయి.ఉక్రెయిన్ వ్యవహారాలు, ఇజ్రాయిల్ వ్యవహారాలు కూడా ఆ పేపర్లలో రావడం ఇపుడు సంచలనంగా మారింది.

వాస్తవానికైతే ఉక్రెయిన్ వద్ద ఎయిర్ స్ట్రైక్( Air strike ) చేసే యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ యుద్ధ విమానాలు తరుగుతూ వస్తున్నాయి.ముఖ్యంగా రష్యా నుంచి వచ్చే యుద్ధ విమానాలను దారిలోనే గుర్తు పట్టి వాటిని పేల్చేసే అధునాతన టెక్నాలజీ మిస్సైల్స్( Technology Missiles ) అనేవి దాదాపుగా అయిపోయాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.ఇన్ని రోజులు అమెరికా, యూరప్ దేశాల నుంచి ఈ మిస్సైల్స్ వచ్చాయి.దాదాపు 95 శాతం ఖాళీ అయిపోయాయి.ప్రస్తుతం 5 శాతం మాత్రమే ఉక్రెయిన్ వద్ద ఉన్నాయని తెలుస్తోంది.

ఆ తర్వాత అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ కి ఆయుధాలు సమకూర్చకపోతే మాత్రం ఉక్రెయిన్ రష్యా చేసే దాడిని తట్టుకోవడం కష్టం.ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్స్ దాదాపుగా తరిగిపోతున్నవేళ రష్యాను ఉక్రెయిన్ ఎలా ఎదుర్కొగలదు? అమెరికా, యూరప్( America, Europe ) దేశాలు వెంటనే ఉక్రెయిన్ కు మిస్సైల్స్ అందజేస్తేనే యుద్ధం కొనసాగగలదు.లేకపోతే చేతులెత్తేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని వివిధ పేపర్లలో కధనం సారాంశం.
దీన్ని ఉక్రెయిన్ కొట్టి పారేసినా ఇదే వాస్తవమనే విషయాన్ని మాత్రం ఒప్పుకోలేకపోతుంది.దీంతో రష్యా, ఉక్రెయిన్ యుద్దం చివరి దశకు వచ్చినట్లే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.







