నాచురల్ స్టార్ నాని ( Nani ) హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”దసరా” ( Dasara ) ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా ఏకంగా 100 కోట్లను క్రాస్ చేసి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాతో నాని కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సినిమా రన్ ఇంకా కొన్ని చోట్ల కొనసాగుతూనే ఉంది.
మరి ఎన్నో రోజుల తర్వాత ఈ రేంజ్ హిట్ అందుకోవడంతో నాని ఈ సినిమా హిట్ ను ఆస్వాదిస్తున్నాడు.ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను నాని లైన్లో పెట్టిన విషయం తెలిసిందే.
నాని కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ( Nani30 ) సినిమాను ఇటీవలే ప్రకటించాడు.

ఇటీవలే మెగాస్టార్ చేతుల మీదగా హైదరాబాద్ లో గ్రాండ్ గా ముహూర్తం జరుపుకుని స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యువ్ ( Shouryuv ) తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.ఈ సినిమా రిలీజ్ డేట్ నిన్న ప్రకటించి అందరికి సర్ప్రైజ్ కూడా ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.ఇదిలా ఉండగా తాజాగా డైరెక్టర్ శైలేష్ కొలను ( Sailesh Kolanu ) చేసిన పోస్ట్ తో నాని ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

హిట్ వంటి సినిమాను తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్ ను నాని తన బ్యానర్ నుండే ప్రకటించాడు.మరి ఈ డైరెక్టర్ పోస్ట్ చేస్తూ.ఈ ఏడాది క్రిస్మస్ కు నాని అన్నవి రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.రెండు కూడా హిట్లే అంటూ పోస్ట్ చేసాడు.ఒకటి ఈయన నటిస్తున్న 30వ సినిమా కాగా మరొకటి ఏంటా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు.

నాని ఈ డైరెక్టర్ వెంకీ మామతో చేస్తున్న సినిమాలో క్యామియో రోల్ ఏమైనా చేస్తున్నాడేమో అనే ఇంట్రెస్టింగ్ టాక్ స్టార్ట్ అయ్యింది.మరి ఆ రెండవ సినిమా ఏంటో ముందు ముందు చూడాలి.ఇక ఈ సినిమాను బ్యూటిఫుల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించడానికి నూతన డైరెక్టర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇది నాని కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచి పోనుంది.ఇక ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.
హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.