తెల్ల జుట్టు సమస్యలు( White Hair Problems ), జుట్టు నిరసిపోవడం వంటి సమస్యల కారణంగా చాలామంది చిన్న వయసులోనే ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఇప్పుడు తెల్ల జుట్టు వయసుతో సంబంధం లేకుండా 20 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువతలో కూడా జుట్టు సమస్యలు కనిపిస్తున్నాయి.
అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే చాలా రకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు.వీటిని ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా మారాడమే కాకుండా కొద్ది రోజుల తర్వాత జుట్టు రివర్స్ డ్యామేజ్ అవుతుంది.
కెమికల్ బేస్డ్ హెయిర్ ఆయిల్( Chemical Based Hair Oil ), హెయిర్ డైని వినియోగించకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన రంగులను ఉపయోగించడం ఎంతో మంచిది.అంతేకాకుండా రోజువారి అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది.
చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి తప్పకుండా కొన్ని రకాల చెడు అలవాట్లను మానుకోవాల్సి ఉంటుంది.అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలి.
రసాయనాలతో కూడిన ప్రొడక్ట్స్ ఉపయోగించకుండా సాధారణ మూలికలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ ఉపయోగించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అయితే జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్( Street Food ) ను అతిగా తినే వారిలో తెల్ల జుట్టు సమస్యలు త్వరగా వస్తాయి.అంతేకాకుండా దీనివల్ల ప్రేగు, మూత్ర పిండాలు, కాలేయం కు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.కాబట్టి జుట్టు సమస్యలు( Hair Problems )రాకుండా ఉండడానికి కేవలం ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్లు, కాలుష్యం, జింక్, ఐరన్, కాపర్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవడం మంచిది.
ముఖ్యంగా చెప్పాలంటే ఆందోళన పడడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ప్రతిరోజు ఒత్తిడి కారణంగా చాలామందిలో శరీర సమస్యలు వస్తాయి.

కాబట్టి అనవసరమైన టెన్షన్ పడకుండా సంతోషకరమైన జీవితాన్ని గడపడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.అంతే కాకుండా ప్రతిరోజు యోగా( Yoga )తో పాటు ధ్యానం చేయాల్సి ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే ఆధునిక జీవనశైలి కారణంగా చాలామంది ధూమపానం, మద్యపానం లాంటి చెడు వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు.కాబట్టి ఇలాంటి అలవాట్లు ఉన్నవారు తప్పకుండా వీటిని త్వరగా దూరం చేసుకోవడం మంచిది.
మెరుగైన ఆరోగ్యం కోసం ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ( Blood Circulation )మెరుగుపడి జుట్టు నల్లగా మారుతుంది.కాబట్టి ప్రతి రోజు వ్యాయామాలు చేయడం ఎంతో మంచిది.







