త్వరలో పెళ్లి కూతురు కాబోతున్నారా.. ఇలా చేస్తే మేకప్ లేకున్నా అందంగా మెరుస్తారు!

త్వరలో పెళ్లి కూతురు( Bride ) కాబోతున్నారా? మీ పెళ్లి లో అందరికంటే మీరే స్పెషల్ అట్రాక్షన్ గా నిలవాలని ఆశపడుతున్నారా? అయితే మీరు ఖ‌చ్చితంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటించాల్సిందే.ఈ రెమెడీ ఎన్నో చర్మ సమస్యలు( Skin Problems ) నివారించి అనేక ప్రయోజనాల‌ను చేకూరుస్తుంది.

 Special Skin Glowing Remedy For Brides, Skin Glowing Remedy, Brides, Home Remedy-TeluguStop.com

అలాగే మేకప్ లేకున్నా సహజంగానే మీరు అందంగా మెరిసేలా చేస్తుంది.మ‌రి ఇంకెందుకు లేటు ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ప‌ది బాదం పప్పులు( Almonds ) వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఎండిన గులాబీ రేకులు, హాఫ్ టేబుల్ స్పూన్ కుంకుమపువ్వు వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.

ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో తయారు చేసి పెట్టుకున్న పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి( Sandalwood Powder ), హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మరియు సరిపడా రోజ్ వాటర్ ను వేసి కలుపుకోవాలి.ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే కనుక రోజ్ వాటర్ కు బదులుగా పచ్చి పాలు కూడా యూస్ చేయవచ్చు.ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, కావాలి అనుకుంటే చేతులకు అప్లై చేసుకుని 20 నుంచి 30 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి.మీ పెళ్లికి కొద్దిరోజుల ముందు నుంచే ఈ రెమెడీని కానుక పాటిస్తే స్కిన్ టోన్( Skin Tone ) అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది.చర్మంపై మొండి మచ్చలు మాయం అవుతాయి.

మొటిమలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఓపెన్ పోర్స్( Open Psores ) క్లోజ్ అవుతాయి.

బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.స్కిన్ మృదువుగా తయారవుతుంది.

అలాగే మీ చర్మం సహజంగానే అందంగా కాంతివంతంగా మరియు ఆకర్షణీయంగా మెరిసిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube