ఈసారి ఎన్నికలలో గెలవకపోతే కాంగ్రెస్ ( Congress Party ) కనుమరుగైపోతుందన్న అంచనాల మధ్య కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిద్ర నుంచి మేలుకున్నట్టే ఉంది.బాజాపాయేతర పార్టీలన్నింటిని ఒక తాటిపైకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది …తాను పెద్దన్న పాత్ర పోషిస్తూ, కలిసి వచ్చే పార్టీలన్నిటితో కూటమి గట్టి బిజేపి ని ( BJP ) ఈసారి ఎలాగైనా ఓడించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది ….
ఆ పార్టీ పార్లమెంటరీ నేత మల్లికార్జున్ కర్గే( Mallikarjun Kharge ) నేతృత్వం లో ఏర్పాటు చేసిన సంయుక్త కమిటీ మీటింగ్ కు తేజస్వి యాదవ్ , నితీశ్ కుమార్ , డిఎంకే పార్టీ,జెడియు పార్టీ నేతలు హాజరయ్యి భవిష్యత్తు రాజకీయాల పై చర్చించినట్టు తెలుస్తుంది ….
విచారణ సంస్థలతో వేధిస్తూ ప్రతిపక్షాలపై ప్రతీకార రాజకీయాలు చేస్తున్న భాజపాను నిలువరించాల్సిన అవసరం ఉన్నదని ,భాజపా ఓటమి అన్నది చారిత్రక అవసరమని అందుకోసం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాకూడా పక్కన పెట్టి అందరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉన్నదని ఈ సమావేశంలో ప్రతిపక్ష నేతలు అభిప్రాయ పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈసారి మళ్ళీ బిజెపి గెలిస్తే రాజకీయంగా తమ ఉనికి ప్రశ్నార్ధకమవుతుందనే అవగాహన కు ఈ పార్టీలన్నీ వచ్చినట్లుగా తెలుస్తుంది….బిజెపితో పాటు కాంగ్రెస్కు కూడా దూరంగా ఉన్న కొన్ని పార్టీలను కలుపుకోవలసిన అవసరం ఉన్నట్లుగా ఈ మీటింగ్ లో సభ్యులు అభిప్రాయపడ్డారని సమాచారం.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ,ఆప్ అదినేత అరవింద్ కేజ్రీవాల్ తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కూటమిలో కలుపుకునే ప్రయత్నాలు చేయాలని అప్పుడే బిజెపిని ఓడించడం సులువవుతుందని ఈ మీటింగ్ లో తీర్మానించారట… వీరిని ఒప్పించే బాధ్యతను బీహార్ సీఎం నితీష్ కుమార్ కి అప్పచెప్పారని ఆ దిశగా ఆయన ఇప్పటికే రంగంలోకి దిగారు అని వార్తలు వస్తున్నాయి …… బిజెపితో పాటు కాంగ్రెస్ యేతర కూటమి అధికారంలోకి రావాలని ,దానికి తామే పెద్దన పాత్ర పోషించాలని పావులు కదుపుతున్న మమతా బెనర్జీ , కేసీఆర్

ఈ కాంగ్రెస్ కూటములోకి రావడానికి ఒప్పుకుంటారా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది మోడీకి తానే అసలైన ప్రత్యర్థిని అని ఇప్పటికే బహిరంగంగా చాటుకున్న అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ కి డ్రైవింగ్ సీట్ అప్పజెప్పడానికి ఒప్పుకోరనే వార్తలు వస్తున్నాయి…… అయితే విచారణ సంస్థల వేదింపులతో గత కొంతకాలంగా వీరు కేంద్ర ప్రభుత్వంతో బాహాబాహీ తలపడుతున్నారు.ఒకవేళ ఈ ఈ సమీకరణా ల లో భాగంగా వారు ఈ కూటమి లో చేరటానికి ఒప్పుకుంటే మాత్రం భాజాపాకు అది ఇబ్బందికర పరిస్థితి అవుతుందని…… గెలుపు అవకాశాలు క్లిష్టమవుతాయని వార్తలు వస్తున్నాయి.







