ఈ వారం ఐపీఎల్ జట్లకు అచ్చిరాని సొంత మైదానాలు.. విజిటింగ్ జట్లదే గెలుపు..!

ఐపీఎల్( IPL ) సీజన్ మొదటి నుంచి ఉత్కంఠ భరితంగా సాగుతూ క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో ఆహ్లాద పరుస్తోంది.అయితే ఈ వారంలో జరిగిన మ్యాచ్ లను గమనిస్తే, ఈ వారం లో సొంత మైదానంలో ఆడిన ఏ జట్టు కూడా విజయం సాధించలేదు.

 Ipl 2023 Visiting Teams Dominate The League In This Week Details, Ipl 2023 ,visi-TeluguStop.com

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు( RCB ) జట్టుకు సొంత మైదానం అయినా చిన్నస్వామి స్టేడియంలో లక్నో – బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఓటమిపాలైంది.కోహ్లీ, ఫాఫ్ డుప్లేసిస్, మ్యాక్స్ వెల్ బాగా రాణించి భారీ స్కోరు నమోదు చేసినప్పటికీ స్టోయినిస్, పూరన్ చెలరేగడంతో సొంతం మైదానంలో బెంగుళూరు జట్టు ఓటమిని చవిచూసింది.

తరువాత ఢిల్లీ వేదికపై ఢిల్లీ జట్టు( Delhi Capitals ) విజయం తథ్యం అనుకుంటే.ఢిల్లీ – ముంబై మధ్య మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరిగింది.ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రాణించడంతో సొంత గడ్డపై ఢిల్లీ ఓడింది.ఢిల్లీ కెప్టెన్ వార్నర్ అర్థ సెంచరీ తో అదరగొట్టిన కూడా ఫలితం దక్కలేదు.చెపాక్ లో చెన్నై – రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా సొంత గడ్డపై చెన్నై ఓటమిపాలైంది.మ్యాచ్ చివర్లో మహేంద్రసింగ్ ధోని, రవీంద్ర జడేజా పోరాడినప్పటికీ.సూపర్ బౌలింగ్ తో రాజస్థాన్ విజయం సాధించింది.

పంజాబ్ సొంత వేదిక మొహాలీ లో గుజరాత్ – పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగి గుజరాత్ విజయం సాధించడంతో.సొంత గడ్డపై పంజాబ్ పోరాడి ఓడింది.కోల్ కత్తా సొంత వేదిక ఈడెన్ గార్డెన్ లో హైదరాబాద్ – కోల్ కత్తా మధ్య జరిగిన మ్యాచ్ లో సొంత గడ్డపై కోల్ కత్తా ఓటమిని చవి చూసింది.

కోల్ కత్తా ఆటగాళ్లను హైదరాబాద్ జట్టు బౌలర్లు కట్టడి చేయడంతో 23 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది.ఈ వారంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో అన్ని జట్లు సొంత గడ్డపై ఓటమిపాలయ్యాయి.

విజిటింగ్ జట్లే విజయాలు అదించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube