ఈ వారం ఐపీఎల్ జట్లకు అచ్చిరాని సొంత మైదానాలు.. విజిటింగ్ జట్లదే గెలుపు..!
TeluguStop.com
ఈ ఐపీఎల్( IPL ) సీజన్ మొదటి నుంచి ఉత్కంఠ భరితంగా సాగుతూ క్రికెట్ ప్రేక్షకులను ఎంతగానో ఆహ్లాద పరుస్తోంది.
అయితే ఈ వారంలో జరిగిన మ్యాచ్ లను గమనిస్తే, ఈ వారం లో సొంత మైదానంలో ఆడిన ఏ జట్టు కూడా విజయం సాధించలేదు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు( RCB ) జట్టుకు సొంత మైదానం అయినా చిన్నస్వామి స్టేడియంలో లక్నో - బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు ఓటమిపాలైంది.
కోహ్లీ, ఫాఫ్ డుప్లేసిస్, మ్యాక్స్ వెల్ బాగా రాణించి భారీ స్కోరు నమోదు చేసినప్పటికీ స్టోయినిస్, పూరన్ చెలరేగడంతో సొంతం మైదానంలో బెంగుళూరు జట్టు ఓటమిని చవిచూసింది.
"""/" /
తరువాత ఢిల్లీ వేదికపై ఢిల్లీ జట్టు( Delhi Capitals ) విజయం తథ్యం అనుకుంటే.
ఢిల్లీ - ముంబై మధ్య మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరిగింది.ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ రాణించడంతో సొంత గడ్డపై ఢిల్లీ ఓడింది.
ఢిల్లీ కెప్టెన్ వార్నర్ అర్థ సెంచరీ తో అదరగొట్టిన కూడా ఫలితం దక్కలేదు.
చెపాక్ లో చెన్నై - రాజస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా సొంత గడ్డపై చెన్నై ఓటమిపాలైంది.
మ్యాచ్ చివర్లో మహేంద్రసింగ్ ధోని, రవీంద్ర జడేజా పోరాడినప్పటికీ.సూపర్ బౌలింగ్ తో రాజస్థాన్ విజయం సాధించింది.
"""/" /
పంజాబ్ సొంత వేదిక మొహాలీ లో గుజరాత్ - పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగి గుజరాత్ విజయం సాధించడంతో.
సొంత గడ్డపై పంజాబ్ పోరాడి ఓడింది.కోల్ కత్తా సొంత వేదిక ఈడెన్ గార్డెన్ లో హైదరాబాద్ - కోల్ కత్తా మధ్య జరిగిన మ్యాచ్ లో సొంత గడ్డపై కోల్ కత్తా ఓటమిని చవి చూసింది.
కోల్ కత్తా ఆటగాళ్లను హైదరాబాద్ జట్టు బౌలర్లు కట్టడి చేయడంతో 23 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది.
ఈ వారంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో అన్ని జట్లు సొంత గడ్డపై ఓటమిపాలయ్యాయి.
విజిటింగ్ జట్లే విజయాలు అదించాయి.