మహారాష్ట్రలోని ముంబై- పూణె పాత రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.ఖోపోలి సమీపంలోని ఓ లోయలో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది.ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా.25 మందికి పైగా గాయపడ్డారు.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించారు.వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.ఘటనా స్థలిలో అధికారుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.







