రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున మాంసాహారం , మద్యం విక్రయాలను బంద్ చేయించాలని బిఆర్ఎస్ పార్టీ ఎల్లారెడ్డిపేట పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
మహాత్మా గాంధీ జయంతి రోజు రాష్ట్రవ్యాప్తంగా మాంసాహారం , మద్యం విక్రయాలు ఏరకంగా నైతే బందు చేశారో అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి రోజున మాంసాహారం , మద్యం విక్రయాలను కూడా వెంటనే రద్దు చేయాలని ఈ మేరకు జీవో వెంటనే జారీ చేయాలని ఆయన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొర్రి ప్రమోద్, శ్రీనివాస్ గడ్డం ఆనందం, వార్డు సభ్యులు పందిళ్ళ శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు,