సిద్దు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda ).డీజే టిల్లు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు.
ఈ సినిమా కన్నా ముందు చాలా చిత్రాల్లోనే నటించినప్పటికి అతడికి గుర్తింపు వచ్చింది మాత్రం దీనితోనే.ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే ఈక్వల్ మొదలైన రోజు నుంచి ఈ చిత్రంపై అనేక రూమర్స్ వస్తున్నాయి.సిద్దు తన ఆటిట్యూడ్ తో దర్శకుడి తో గొడవ పడ్డాడని, హీరోయిన్స్ పారిపోయేలా చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇప్పటికే ముగ్గురు హీరోయిన్స్ మారిన ఈ చిత్రంలో అసలు ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారు అనే క్లారిటీ కూడా ఎవరికి లేదు.అయితే తాజాగా సిద్దు ఒక మీడియా సంస్థకి ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ పై స్పందించాడు.

సిద్దు వర్షన్ మాత్రం ఇంకోలా ఉంది.తనకు అసలు ఎవరితో గొడవలు లేవని, దర్శకుడు విమల్ కృష్ణ( Vimal Krishna )కి నాకు ఎలాంటి ప్రాబ్లంస్ రాలేదని, తను నా తన వల్లే సినిమా వదిలి పెట్టి పోయాడు అనే వార్తలో నిజం లేదు అంటూ చెబుతున్నాడు.ఇక ఈ చిత్రానికి మొదటి నుంచి హీరోయిన్ విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవమే కానీ అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) తానే స్వయంగా ఈ సినిమాలో నటిస్తానని ముందుకు వచ్చిందని, ఇప్పుడు కూడా ఈ సినిమాకి అనుపమ మాత్రమే హీరోయిన్ అంటూ తేల్చి చెప్పాడు సిద్దు జొన్నలగడ్డ.ఈ సమాధానంతో డిజే టిల్లు సినిమాకి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అనే ఒక క్లారిటీ సినిమా ప్రేక్షకులకు వచ్చింది.

ఇక సినిమా విషయానికి వస్తే డిజే టిల్లు రెండవ భాగానికి టిల్లు స్క్వేర్ అనే పేరును పెట్టారు.ఆగస్టులోనే ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకుడు డేట్ బ్లాక్ చేయగా, హీరో వల్లనే సినిమా షూటింగ్ లేట్ అవుతుంది అనే రూమర్స్ టాలీవుడ్ సర్కిల్ లో బాగా వినిపిస్తున్నాయి.ఇక క్రియేటివిటీ విషయానికి వస్తే దర్శకుడుతో మొదటి నుంచి సిద్దుకి పేచి ఉంది.

దర్శకుడు ఏం చేస్తున్నా వినే అలవాటు లేని సిద్దు తానే సినిమాని డైరెక్ట్ చేస్తున్నట్టుగా భావిస్తున్నాడు అనే విషయం చాలా రోజులుగా ప్రచారం సాగుతోంది.ఇక పార్ట్ 2 కి దర్శకుడిగా మల్లిక్ రామ్ వ్యవహరిస్తుండగా, ఇతడు ఇప్పటికే పెళ్లిగోల 2, అద్భుతం, తరగతి గది దాటి అనే ప్రాజెక్టు సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు.







