ఈ రోజుల్లో ప్రేమించుకోవడం, చిన్నచిన్న మనస్పర్ధలకే బ్రేకప్ చెప్పేసి ఎవరి దారి వారు చూసుకోవడం సర్వసాధారణంగా మారింది.కేవలం ప్రేమించుకున్న వాళ్ళల్లో కొద్దిమంది మాత్రమే వివాహ బంధంతో ఒకటై సంతోషంగా జీవిస్తూ ఉంటే.
చాలామంది కేవలం ఎదుటి వ్యక్తి ఆకర్షణకు లోనై సరైన అవగాహన లేక జీవితాలను పాడు చేసుకుంటున్నారు.ఈ కోవకు చెందిన ఒక సంఘటన హైదరాబాద్ లో( Hyderabad ) చోటుచేసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
కొంతకాలం ప్రేమించుకుని విడిపోయిన తర్వాత హఠాత్తుగా తన మాజీ బాయ్ ఫ్రెండ్( Ex Boy Friend ) అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించడంతో పాటు తనపై లైంగిక దాడికి ప్రయత్నించాడంటూ యువతి గురువారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో( Jubilee Hills Police Station ) ఫిర్యాదు చేసింది.ఆ యువతి ఫిర్యాదుతో ఆ నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం లలిత్ సెహెగల్ అనే వ్యక్తి పబ్ లలో గిటారిస్టుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇతనికి 2016లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న యువతి (36) తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది.అప్పటినుండి ఐదు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2021 లో విడిపోయి తమ ప్రేమకు బ్రేకప్ చెప్పేసుకున్నారు.అయితే కొంతకాలంగా లలిత్ సెహెగల్ స్నేహితుడితో ఆ యువతి సన్నిహితంగా మెలుగుతున్న విషయం తెలిసి.
ఆ యువతిని నిలదీయడం కోసం గురువారం రాత్రి లలిత్, ఆ యువతి ఇంటికి వెళ్ళాడు.మాజీ ప్రియుడు ఎటువంటి అనుమతి లేకుండా సడన్ గా ఇంటికి రావడం,
మద్యం మత్తులో అసభ్యకరంగా మాట్లాడడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది.ఒకరిపై ఒకరు అరుపులతో, కేకలతో విరుచుకుపడ్డారు.దీంతో తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయినా లలిత్ ఆ యువతి దుస్తులను చించేస్తూ లైంగిక దాడికి ప్రయత్నించాడు.
అతని నుండి తప్పించుకొని ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.లలిత్ మద్యం మత్తులో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడా.లేదంటే ఈ దారుణానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.