రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..అంటూ విశాఖ ఉక్కు పై పవన్ సంచలన పోస్ట్..!!

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేయడం తెలిసిందే.కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan ) తనదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందించారు.

 Pawan's Sensational Post On Visakha Steel Is Not Sincere To The State Government-TeluguStop.com

కేంద్ర ప్రకటన ఆశాజనకంగా ఉందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలని చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు.“విశాఖ ఉక్కు అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన పరిశ్రమ.32 మంది ప్రాణ త్యాగాలతో… ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా సిద్ధించినది విశాఖ ఉక్కు పరిశ్రమ.ఇంతటి ఘన నేపథ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలన్నది జనసేన పార్టీ ఆకాంక్ష.ఈ పరిశ్రమ ప్రయివేటీకరణ అంశం ప్రకటన వచ్చినప్పుడు స్పందించి ఢిల్లీ పెళ్ళి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసినప్పుడు వారు సానుకూలంగానే స్పందించారు.

ఆ స్పందన ఎంతో ఆశావాహంగా కనిపించిది.కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత షా( Amit Shah ) గారిని కలిసి విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకున్న భావోద్వేగ బంధాన్ని తెలియచేసి ఈ పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరాం.ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగన్ సింగ్ కులస్తే గారు ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ‘ ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదు.దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదు’ అని చేసిన ప్రకటన హర్షణీయం.

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో రైతులు తమ భూములను త్యాగం చేశారు.ఇందులో కొందరికి ఇప్పటికీ సెటిల్మెంట్ కాలేదు.

ఇలాంటి పరిశ్రమపై రాష్ట్ర పాలకులు సైతం ప్రత్యేక శ్రద్ధ చూపాలి.

వారికి తొలి నుంచీ చిత్తశుద్ధి లోపించింది.జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలవడంతోపాటు భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర పాలకులు అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని విజ్ఞప్తి చేశాం.అయినా వైసీపీ పాలకులు స్పందించలేదు.

జనసేన పార్టీ( Janasena ) ప్రతి సందర్భంలో కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రులతో చర్చించినప్పుడు విశాఖ ఉక్కును పరిరక్షించాలని బలంగా చెప్పాం.

కొద్ది రోజుల కిందట పొరుగు ఈ అంశంలో స్పందించింది.దీని వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపథ్యాలపై వైసీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారు తప్ప పరిశ్రమ కాపాడుతామనే మాట చెప్పలేకపోయారు.చిత్తశుద్ధి లేని రాష్ట్ర విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం ముందుకు వెళ్లలేదు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపింది.జనసేన పార్టీ తొలి నుంచి ఈ పరిశ్రమను పరిరక్షించాలనే కోరుతోంది.

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను బలోపేతం చేయాలని నిర్ణయించిన దృష్ట్యా విశాఖ ఉక్కు బలపడుతుందని భావిస్తున్నాను” అని పవన్ పోస్ట్ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube