రాధిక ఆప్టే( Radhika Apte ) హీరోయిన్ గా కంటే వివాదాల ద్వారా ఎక్కువగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే.సౌత్ ఇండస్ట్రీ గురించి గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన ఈ బ్యూటీ కొన్నిరోజుల క్రితం హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ ( Remuneration )డిఫరెన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ ల కోసం ఈ బ్యూటీ బోల్డ్ రోల్స్ లో నటించ్ మెప్పించిన సంగతి తెలిసిందే.మూవీ ఆఫర్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగిన సమయంలో ఎన్నో అవమానాలు ఎదురయ్యాయని అమె తెలిపారు.

సినిమా ఇండస్ట్రీలో ఎక్కువకాలం కెరీర్ ను కొనసాగించాలని భావిస్తే శరీరంలో మార్పులు తప్పనిసరి అని ఆమె కామెంట్లు చేశారు.సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం తిరిగిన సమయంలో ముక్కు షేప్ ను మార్చుకోవాలని కొందరు సూచించారని ఆమె అన్నారు.మరి కొందరు ఏకంగా వక్షోజాల సైజులను పెంచుకోవాలని చెప్పారని రాధికా ఆప్టే కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కొరకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ తరహా అనుభవాలు ఎదురు కావడంతో నాపై నాకే అపనమ్మకం ఏర్పడిందని ఆమె అన్నారు.ఆ తర్వాత రోజుల్లో నెగిటివ్ కామెంట్లను పట్టించుకోకుండా సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యానని రాధికా ఆప్టే అభిప్రాయం వ్యక్తం చేశారు.కొంతమంది ప్రవర్తన వల్ల సినిమా ఇండస్ట్రీకి దూరం కావాలని అనిపించిందని రాధికా ఆప్టే అన్నారు.

రాధికా ఆప్టే సౌత్ లో మరింత బిజీ కావాలని రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.రాధికా ఆప్టే పారితోషికం సైతం భారీ రేంజ్ లో ఉందని బోగట్టా.రాధికా ఆప్టే కెరీర్ పరంగా ఇతర హీరోయిన్లకు భిన్నంగా కెరీర్ పరంగా అడుగులు వేస్తున్నారు.ఆమెకు సోషల్ మీడియా(Social Media )లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.







