మంచిర్యాల జిల్లాలో రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ సభను నిర్వహిస్తున్నామని తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు.ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని మాణిక్ రావు ఠాక్రే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కక్ష సాధింపులో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీకి మద్ధతుగా దేశ వ్యాప్తంగా సత్యాగ్రహా సభలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.







