మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.కేసులో ఏ4 దస్తగిరి అప్రూవర్ గా అనుమతించడాన్ని సవాల్ చేస్తూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.
గత విచారణలో భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.సునీల్ యాదవ్ తల్లిని వివేకానంద రెడ్డి లైంగికంగా వేధించారని, అందువలనే హత్య జరిగిందని ఆరోపించారు.
అదేవిధంగా వైఎస్ వివేకా కుటుంబంలోనూ వివాదాలు ఉన్నాయని లాయర్ వాదించారు.అయితే ఇవాళ వివేకా కుమార్తె సునీతా రెడ్డి తరపు న్యాయవాది కోర్టుకు వాదనలు వినిపించనున్నారు.
ఈ మేరకు మధ్యాహ్నం మూడు గంటలకు హైకోర్టులో విచారణ జరగనుంది.దాంతో పాటు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా కోర్టు విచారణ చేయనుంది.
కాగా ఏ1 ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.







