మన సినిమాలకు పాన్ ఇండియా (Pan India) వ్యాప్తంగా మాత్రమే కాదు.పాన్ వరల్డ్ వైడ్ గా కూడా గిరాకీ పెరిగింది.
బాహుబలి తర్వాత మన టాలీవుడ్ నుండి వచ్చిన చాలా సినిమాలు వరల్డ్ వైడ్ గా గుర్తింపు పొందాయి.ఎందుకంటే మన సినిమాల్లో ఉండే కంటెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్ ను అలరిస్తుంది.
అందరు మెచ్చేలా తెరకెక్కుతున్న మన సినిమాలకు డిమాండ్ పెరిగింది.
దీంతో మన సినిమాలను అన్ని భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
ఇక మన సినిమాలను ఇప్పుడు జపాన్ లో సైతం రిలీజ్ చేసి అక్కడి ఆడియెన్స్ ను అలరిస్తున్నారు.జపాన్ లో చాలా కొద్దీ మంది ఇండియన్ హీరోలకు మాత్రమే ఆదరణ ఉంది.
ఇటీవలే ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాను జపాన్ (Japan) లో రిలీజ్ చేయగా అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ రాబట్టింది.

దీంతో చరణ్, ఎన్టీఆర్ (NTR) లకు మంచి పేరు వచ్చింది.మరి ఈ క్రమంలోనే మొన్న చరణ్ నటించిన రంగస్థలం (Rangasthalam) మూవీని అక్కడ రిలీజ్ చేసారు.ఇది కూడా మంచి హిట్ అందుకుని అక్కడి ఆడియెన్స్ ను మెప్పించింది.
ఇక ముందు ముందు మన సినిమాలు మరిన్ని రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఇప్పుడు మన హీరోలు జపనీయులు ప్రేమను గెలుచుకున్నారు.
టాలీవుడ్ (Tollywood) లోనే టాప్ హీరోలు అయిన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ (Prabhas), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan) ఇద్దరు కూడా జపాన్ ప్రేక్షకుల ప్రేమను పొందారు.

అక్కడి ఒక ప్రముఖ మూవీ ప్లస్ సంస్థ జపాన్ ఆడియెన్స్ (Japanese fans) ఇండియన్ సినిమా హీరోస్ విషయంలో వారు ఎలా అనుకుంటున్నారు అని పోల్ నిర్వహించగా అందులో మన స్టార్ హీరో చరణ్ ను నెంబర్ 1 హీరోగా ఎంచుకోగా.నెంబర్ 2 స్థానంలో ప్రభాస్ నిలిచాడు.ఇలా టాప్ స్థానాల్లో ఇద్దరు మన టాలీవుడ్ స్టార్స్ (Tollywood Stars) నిలవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
జపాన్ ఆడియెన్స్ మనసును మన స్టార్స్ గెలుచు కున్నారు అనే చెప్పాలి.







