బుల్లితెర యాంకర్ గా, బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుని బుల్లితెర స్టార్ మహిళగా కొనసాగుతున్న యాంకర్ సుమ ( Suma ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ప్రస్తుతం సుమ బుల్లితెర కార్యక్రమాలను కాస్త తగ్గించిన సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.
ఇలా వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి సుమ అరెస్టు అవ్వడం ఒకసారిగా అందరిని కలవరపెడుతుంది.చేతులకు సంకెళ్లు వేసి కారులో తనని తీసుకెళ్తున్నటువంటి ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫోటో వైరల్ అవ్వడంతో యాంకర్ సుమ ఏంటి అరెస్ట్ కావడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.అయితే ఈమెను నిజంగానే పోలీసులు అరెస్టు చేశారు అనుకుంటే పొరపాటే.ఈ సంకెళ్లు చూస్తేనే అర్థమవుతుంది నాగచైతన్య( Nagachaitanya ) కస్టడీలో( Custody ) కి సుమ వెళ్లిపోతున్నారని.నాగచైతన్య తాజాగా నటించిన చిత్రం కస్టడీ.ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేసిన సమయంలో డైరెక్టర్ వెంకట్ ప్రభు( Venkat Prabhu )ను సైతం ఇలాగే అరెస్టు చేసి తీసుకెళ్లి సినిమా అప్డేట్ వదలారు.
ఇక సుమను కూడా ప్రస్తుతం ఇలా సంకెళ్లతో తీసుకెళ్లడం చూస్తుంటే ఈ సినిమా ప్రమోషన్ లో ఒక భాగమైనని అర్థమవుతుంది.

యాంకర్ సుమ సమక్షంలో కస్టడీ చిత్ర బృందాన్ని సుమ ఇంటర్వ్యూ చేయనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం సుమకు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి సుమ తన ప్రశ్నలతో నాగచైతన్యను ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తారో తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమా మే 12వ తేదీ తెలుగు తమిళ భాషలలో విడుదల కానుంది.ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటి కృతి శెట్టి ( Kriti Shetty )నటించారు.
ఇక ఈ సినిమాకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ( Ilayaraaja ) సంగీతం అందించారు.ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ట్రైలర్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.
మరి కస్టడీ ద్వారా నాగచైతన్య ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.







